iDreamPost

స్కూల్ లో కొట్టుకున్న టీచర్, వంట మనిషి.. వైరల్ గా మారిన వీడియో!

స్కూల్ లో కొట్టుకున్న టీచర్, వంట మనిషి.. వైరల్ గా మారిన వీడియో!

మాములుగా అత్తా కొడళ్లు, భార్యాభర్తలు కొట్టుకోవడం మనం అప్పుడప్పుడు చేస్తుంటాం. కానీ, స్కూల్ వంట మనిషి, టీచర్ కొట్టుకోవడం మీరెప్పుడైనా చూశారా? కానీ, ఓ రాష్ట్రంలో అదే జరిగింది. అందరూ చూస్తుండగానే ఆ ఇద్దరి ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని చితక్కొట్టుకున్నారు. ఇక పక్కనున్న టీచర్లు వారిని విడిపించాల్సింది పోయి.. తమ తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర ధరూర్ పరిధిలోని జోడ్ హింగానీలో జిల్లా పరిషత్ స్కూల్ ఉంది. ఇందులో స్థానికంగా ఉండే ఎంతోమంది నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే, ఈ స్కూల్ లో పిల్లలకు వండి పెట్టిన కిచిడీ నాణ్యంగా లేదని ఆ స్కూల్ టీచర్ శనివారం ఆ మంట మనిషిని ప్రశ్నించింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం నడిచింది. ఇక కోపంతో ఆ టీచర్.. వంట మనిషి భర్త స్కూల్ ఆవరణలో కిరాణ షాప్ పెట్టడం ఏంటని అతని భార్యతో గొడవకు దిగింది.

ఇక వీరి గొడవ చినిగి చినిగి చివరికి గాలి వానలా తయారైంది. దీంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన టీచర్, వంట మనిషి ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని చితక్కొట్టుకున్నారు. ఇక వీరిని విడిపించాల్సిన ఆ స్కూల్ టీచర్లు సినిమా చూసినట్లు చూశారు. మరికొందరు మాత్రం.. తమ తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

ఇది కూడా చదవండి: నోబెల్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న 6 నెలల బాలుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి