iDreamPost

ప్రజా సమస్యల ప్రస్తావనలో విజయసాయిరెడ్డి పాత్ర భేష్‌!

ప్రజా సమస్యల ప్రస్తావనలో విజయసాయిరెడ్డి పాత్ర భేష్‌!

ప్రజా సమస్యలను రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తూ.. పలు కీలక చర్చల్లో పాల్గొంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దూసుకుపోతున్నారు. రాజ్యసభ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటూ అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఎన్నో సార్లు రాజ్యసభకు ఎన్నికైన వారికంటే కూడా విజయసాయిరెడ్డి అనతికాలంలోనే రాజ్యసభ సెక్రటరియట్‌ ప్రశంసలు పొందుతున్నారు. సమస్యల ప్రస్తావనలో తనకున్న అవకాశాలను చక్కగా వినియోగించుకున్నట్లు బుధవారం విడుదలైన సెక్రటేరియట్‌ బులిటెన్‌లో వెల్లడైంది.

రాజ్యసభలో 155 మంది సభ్యులు మాట్లాడితే.. అందులో 83 మంది సభ్యులు రెండు కంటే ఎక్కువసార్లు చర్చల్లో పాల్గొన్నారు. అయితే విజయసాయిరెడ్డి ఏకంగా 9 సందర్భాల్లో తన గళాన్ని వినిపించారు. కేపీ ఉల్లి ఎగుమతులు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరానికి సవరించిన అంచనాల ఆమోదంలో జాప్యం, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయం.. ఇలా అన్ని విషయాలపై విజయసాయిరెడ్డి సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి మౌఖిక ప్రశ్నలు కూడా సంధించి సమాధానాలు రాబట్టారు. రాజ్యసభ సమావేశాల్లో విజయసాయిరెడ్డి ప్రశంనీయమైన రీతిలో తన పాత్ర పోషించారని రాజ్యసభ సచివాలయం కొనియాడింది. కాగా, ఇతర రాష్ట్రాల ఎంపీలు పీఎల్‌ పునియా, హుస్సేన్‌ దల్వాయి, ప్రొఫెసర్‌ ఎంకే ఝూ, అమర్‌ పట్నాయక్, రవి ప్రకాశ్‌ వర్మ, అశోక్‌ బాజ్‌పాయ్, అమర్‌ శంకర్‌ సాబుల్‌ 5 సందర్భాల్లో తమ గళాన్ని వినిపించారు.

మెరుగ్గా రాజ్యసభ సమావేశాలు..

ఎప్పుడూ ఆందోళనలు, నిరసనల వల్ల వాయిదాల పర్వంతో కొనసాగే రాజ్యసభ సమావేశాలు ఈ సారి సాఫీగా జరిగాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగిన బడ్జెట్‌ తొలి దశ సమావేశాలు ఏకంగా 96 శాతం ఉత్పాదకత సాధించాయి. మొత్తం 41.10 గంటలపాటు సభ జరగాల్సి ఉండగా.. 38.30 గంటలపాటు కొనసాగింది. రెండో దశ సమావేశాలు మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3 వరకు కొనసాగనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి