iDreamPost

చంద్రబాబుకు తెలిసింది మోసం- దగా మాత్రమే: MP విజయసాయిరెడ్డి

బాపట్ల నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర కొనసాగుతోంది. ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును దుయ్యబట్టారు.

బాపట్ల నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర కొనసాగుతోంది. ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును దుయ్యబట్టారు.

చంద్రబాబుకు తెలిసింది మోసం- దగా మాత్రమే: MP విజయసాయిరెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. తన స్వార్థం కోసమే చంద్రబాబు పాలించారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుకు తెలిసింది కేవలం మోసం, దగా మాత్రమే అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బాపట్ల ప్రజలు అందుకే బాబుపై సానుభూతి చూపడం లేదన్నారు. అటు జాతీయ నాయకులు కూడా బాబు విషయంలో సపోర్ట్ చేయడం లేదని చెప్పారు.

అటు లోకేశ్ పై కూడా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. లోకేశ్ లో నాయకత్వ లక్షణాలు లేవంటూ చెప్పుకొచ్చారు. అసలు లోకేశ్ ప్రజల కోరికలు నెరవేర్చే కాదంటూ విమర్శించారు. చంద్రబాబు లాగానే లోకేశ్ కూడా వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పక్కా ఆధారలతోనే చంద్రబాబును అరెస్టు చేసినట్లు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన పాపం పండింది కాబట్టే జైలులో ఉన్నారన్నారు. పురంధేశ్వరికి కూడా విజయసాయిరెడ్డి హితవు పలికారు. ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచించారు. లిక్కర్ స్కామ్ లో తనపై మిథున్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఎలాంటి సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై ఆరోపణలు చేయడం సరికాదంటూ వ్యాఖ్యానించారు.

ఇళ్ల నిర్మాణాలు చూసి తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతోంది. పేద ప్రజలకు పింఛను పెంచితే టీడీపీ తట్టుకోలేకపోతోంది. సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు చరిత్ర ముగిసింది. అన్ని స్థానాల్లో వైసీపీనే గెలవబోతోందన్నారు. చంద్రబాబు ఆయన కుటుంబాన్ని మాత్రమే చూసుకున్నారు అంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు. చంద్రబాబు ప్రజలకు ద్రోహం చేశారు కాబట్టే ఇప్పుడు ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బాపట్ల నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి