iDreamPost

SSC Resultsఐ: పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌.. చెక్‌ చేసుకొండి

  • Published Apr 22, 2024 | 11:06 AMUpdated Apr 22, 2024 | 11:06 AM

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. రిజల్ట్ చెక్ చేసుకోవడం కోసం లింక్ ఇక్కడ ఇస్తున్నాం. చూసుకొండి.

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. రిజల్ట్ చెక్ చేసుకోవడం కోసం లింక్ ఇక్కడ ఇస్తున్నాం. చూసుకొండి.

  • Published Apr 22, 2024 | 11:06 AMUpdated Apr 22, 2024 | 11:06 AM
SSC Resultsఐ: పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్‌.. చెక్‌ చేసుకొండి

మొన్నటి వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షలతో బిజీ బిజీగా గడిపారు. ఏప్రిల్‌ మొదటి వారం నాటికి పది, ఇంటర్‌ ఎగ్జామ్స్‌ అయిపోయాయి. దాంతో అందరూ పరీక్షా ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇ‍ప్పుడు పదో తరగతి ఎగ్జామ్స్‌ రిజల్ట్‌ గురించి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్‌ 22, సోమవారం నాడు పది ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఎగ్జామ్స్‌ పూర్తైన వెంటనే అధికారులు పదో తరగతి ఆన్సర్‌ షీట్స్‌ మూల్యాంకనం ప్రారంభించారు. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఈ దిశగా అడుగులు వేశారు. అందుకే పేపర్‌ మూల్యాంకనం త్వరగా ప్రారంభించారు. ఇక తాజాగా నేడు అనగా సోమవారం నాడు పరీక్ష ఫలితాలు విడుదల చేశారు.

ఏప్రిల్‌ 22వ తేదీఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలు ఉన్న నేపథ్యంలో ఫలితాల విడుదలకు ఈసీ నుంచి అనుమతులు లభించాయి. దీంతో 11 గంటలకు రిజల్ట్స్‌ను అధికారికంగా ప్రకటించారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని తాజ్‌ వింటా హోటల్‌లో ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేస\్‌ కుఆర్‌ వెబ్‌సైట్‌లో 2023-24 పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.

ఇక ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా.. మరో 1.02 లక్షల మంది ప్రైవేట్‌ గాను పదో తరగతి పరీక్షలు రాశారు. ఫలితాలు విడుదల చేయగానే వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను భుత్వ వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా కూడా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను ఎంటర్‌ చేసి రిజల్ట్స్‌ తెలుసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఇంకా ఇంటర్ పరీక్షా ఫలితాలే విడుదల కాలేదు. త్వరలోనే ఇవి రానున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి