iDreamPost

టికెట్ ఇవ్వలేదని టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కూటమిలో భాగంగా తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేశారు టీడీపీ, జనసేన అధ్యక్షులు. దీంతో అసమ్మతి మొదలైంది. అటు తెలుగు తమ్ముళ్లు, ఇటు జన సైనికులు తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు.

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కూటమిలో భాగంగా తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేశారు టీడీపీ, జనసేన అధ్యక్షులు. దీంతో అసమ్మతి మొదలైంది. అటు తెలుగు తమ్ముళ్లు, ఇటు జన సైనికులు తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు.

టికెట్ ఇవ్వలేదని టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం..!

ఆంధ్రపదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఏకమయ్యాయి ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు. ఈ క్రమంలో తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేశారు ఆ పార్టీల అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. 118 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. అందులో జనసేనకి దక్కినవే కేవలం 24 సీట్లు మాత్రమే. ఇక మూడు పార్లమెంట్ స్థానాలను తీసుకుంది. ఈ సీట్ల పంపకం, కేవలం 24 స్థానాల్లో మాత్రమే జనసేనకు కేటాయించడంతో పవన్ వెంట నడిచిన నేతల్లో అసంతృప్తి ఆకాశాన్ని తాకింది. కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి వెళ్లిపోవడంతో అసమ్మతి వెళ్లగక్కుతున్నారు జన సైనికులు. అటు టీడీపీ నేతల్లో కూడా ఇదే నైరాశ్యం నెలకొంది.

టికెట్ ఆశించి భంగపాటుకు గురయ్యారు చాలా మంది. వారిలో కర్నూలు జిల్లా కోడమూరు టీడీపీ నేత ఆకెపోగు ప్రభాకర్ ఒకరు. ఎన్నో ఏళ్ల నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉంటే.. తనకు అన్యాయం చేశారంటూ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పార్టీని నమ్ముకుని, సేవ చేసిన తనకు సీటు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు మనస్థాపానికి గురై.. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభాకర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, భర్త ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి.. చంద్రబాబు సీటు ఇవ్వకపోవడమేనంటూ భార్య కన్నీరు మున్నీరు అయ్యారు. ఇదిలా ఉంటే..తొలి జాబితా విడుదలయ్యాక తెలుగు తమ్ముళ్లు కొంత మంది బహిరంగంగానే తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నేరుగా చంద్రబాబుతోనే తాడో పేడో తేల్చుకుందామని సిద్దమౌతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని, సేవ చేసిన నేతల్ని కాదని.. మరొకరికి సీటు కేటాయించడంపై మండిపడుతున్నారు. అటు జన సైనికుల్లో కూడా నిరాశ, నిస్పృహ రాజ్యమేలుతోంది. సుమారు పదేళ్లుగా జన సేన, పవన్ కళ్యాణ్ వెంట నడిచిన వాళ్లని లెక్క చేయకుండా.. పొత్తులో భాగంగా మరో పార్టీ నేతలకు సీట్లు కేటాయించి.. టీడీపీకి ఊడిగం చేస్తున్నారని గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లు కష్టపడింది.. ఈ స్థానాలకేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. పాతిక వంతు లేని సీట్ల కోసం పొత్తు అవసరమా అంటూ నిలదీస్తున్నారు జన సైనికులు. మొత్తానికి కూటమిలో అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి