iDreamPost

AP ప్రజలకు చల్లని వార్త.. 3 రోజుల్లో ఆ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు

  • Published Apr 22, 2024 | 5:05 PMUpdated Apr 22, 2024 | 5:05 PM

ఈ ఏడాది ఎక్కడ చూసిన విపరీతమైన ఎండలు మండిపడడంతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడుతున్నాయి. కనీసం సాయంత్రం 6 దాటిన ఈ ఎండ తీవ్రత అనేది చల్లారడం లేదు. దీంతో ప్రజలు బయటకు వెళ్లలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రజలకు వాతవరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో 3 రోజుల్లో ఈ ప్రాంతాలకు ఈదురుగాలులు, వర్షాలు పడనున్నాయి.

ఈ ఏడాది ఎక్కడ చూసిన విపరీతమైన ఎండలు మండిపడడంతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడుతున్నాయి. కనీసం సాయంత్రం 6 దాటిన ఈ ఎండ తీవ్రత అనేది చల్లారడం లేదు. దీంతో ప్రజలు బయటకు వెళ్లలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రజలకు వాతవరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో 3 రోజుల్లో ఈ ప్రాంతాలకు ఈదురుగాలులు, వర్షాలు పడనున్నాయి.

  • Published Apr 22, 2024 | 5:05 PMUpdated Apr 22, 2024 | 5:05 PM
AP ప్రజలకు చల్లని వార్త.. 3 రోజుల్లో ఆ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు

గత కొన్ని రోజులుగా ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. భగ భగ మంటు ఎండలతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అసలు ఉదయం 8 గంటల నుంచే విపరీతమైన ఎండలు మండిపడటంతో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావలంటేనే బయపడుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే సుమారు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఎండలు నమోదవుతున్నాయి. అలాగే మండే ఎండలకు తోడదు వేడిగాలులతో ప్రజలు బయటకి వెళ్లలేక.. అలా అని ఇంట్లో ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అయితే ఈ ఉక్కపోతలతో అల్లడిపోతున్నా ప్రజలకు కాస్త ఎండలకు బ్రేక్ ఇస్తూ.. ఉపశమనం కలిగించడానికి వరుణుడు గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిపిస్తున్నాడు. అయితే తాజాగా ఏపీలోని వచ్చే మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతవరణ శాఖ పేర్కొంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ ఏడాది ఎక్కడ చూసిన విపరీతమైన ఎండలు మండిపడడంతో ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడుతున్నాయి. కనీసం సాయంత్రం 6 దాటిన ఈ ఎండ తీవ్రత అనేది చల్లారడం లేదు. దీంతో ప్రజలు బయటకు వెళ్లలంటేనే భయపడుతున్నారు. అయితే గత రెండు గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం ఇస్తూ.. తేలికపాటి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని వచ్చే మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతవరణ శాఖ పేర్కొంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. కనుక ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు ప్రజలకు సూచించారు. అయితే ఈ వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది.

ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముంది. అయితే ఈదురుగాలులు(గంటకు 30 -40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.  అలాగే రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముంది. వీటితో పాటు వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

అయితే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.  అలాగే వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమలో అయితే ఈరోజు వాతావరణం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. కాగా, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.  ఇక ఈదురు గాలులు అనేవి (గంటకు 30 -40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉంది. మరి, ఏపీలో ఈ ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుందని వాతవరణ శాఖ తెలియజేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి