iDreamPost

ఈ ఫోటోలో చిన్నారి ఓ స్టార్ హీరో భార్య.. ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ.. హాయ్ అంటూ పలకరిస్తోన్న ఈ చిన్నదాన్ని చూశారా.. ఆమె ప్రముఖ హీరో భార్య మాత్రమే కాదూ.. ఆమె ఫ్యామిలీలో మొత్తం స్టార్సే. ఇంతకు ఆ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ.. హాయ్ అంటూ పలకరిస్తోన్న ఈ చిన్నదాన్ని చూశారా.. ఆమె ప్రముఖ హీరో భార్య మాత్రమే కాదూ.. ఆమె ఫ్యామిలీలో మొత్తం స్టార్సే. ఇంతకు ఆ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలో చిన్నారి ఓ స్టార్ హీరో భార్య.. ఎవరో తెలుసా..?

కొంత మంది హీరోయిన్లు చాలా క్యూట్ అండ్.. బబ్లీగా ఉంటారు. తెరపై కూడా వారి నటన అలాగే ఉంటుంది. కానీ సడెన్‍గా చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసుకుని ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తూ ఉంటారు. కలల రాణిగా ఊహించుకునే లోపు.. మరో యువరాజు మెడలో వరమాల వేస్తూ ఉంటుంది ఈ రాకుమారి. పెళ్లి చేసుకుని సినిమాల నుండి తప్పుకోవడమే లేకుంటే.. తగ్గించడమే చేస్తుంటారు. భాగ్యశ్రీ..మైనే ప్యార్ కియా(ప్రేమ పావురాలు) మూవీతో దిల్ ఖుష్ చేసిన ఆమె.. ఇలా వచ్చిందో లేదో.. అలా పెళ్లి పీటలు ఎక్కేసింది. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేసినా.. ఈ సినిమా అంత మెప్పించలేకపోయాయి. ఆ తర్వాత దివ్య భారతి.

ఇప్పటికి ఆ నటి పేరు తలుచుకుంటే అప్పటి యూత్ గుండెల్లో గుబులు పుడతాయి. ఆమె కూడా అంతే.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సాజిద్ నడియాడ్ వాలాను రహస్య వివాహం చేసుకుంది. అనంతరం మరణాన్నే ఆహ్వానించింది. అది వేరో విషయం. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ బుడ్డది కూడా పెళ్లిళ్ల విషయంలో వీళ్ల బాపతే. చిన్న గౌనుతో హాయ్ అంటూ పలకరిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఆమె ఓ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదూ.. ఓ సూపర్ స్టార్ హీరోకు భార్య కూడా. ఇంతకు అతడు ఎవరో తెలుసా..? ఇటీవల చాలా రోజుల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ చిన్నోడు ఆర్య. ఆర్య అసలు పేరు జంషద్ సితిరాకత్. సినిమాల కోసం ఆర్యగా మార్చుకున్నాడు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి మన అఖిల్ హరోయిన్ సాయేషా సైగల్.

ప్రముఖ బాలీవుడ్ నటి, దిగ్గజ హీరోయిన్ సైరా భాను మనవరాలు ఈమె. ఆమె తండ్రి కూడా నటుడే. ఆమె పుట్టి, పెరిగింది అంతా సినిమా ప్రపంచంలోనే. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామ.. తెలుగు పరిశ్రమ ద్వారా తన నటనకు ఓనమాలు దిద్దుకుంది. అఖిల్ మూవీ ‘అఖిల్’ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాలు రాలేదు. అనంతరం బాలీవుడ్ చెక్కేసిందీ బ్యూటీ.. శివాయ్ అనే మూవీలో నటించింది. ఆ తర్వాత తమిళ పరిశ్రమలోకి ప్రవేశించింది. అక్కడే ఆమె జీవితం మలుపులు తిరిగిపోయింది. వానమగన్, కడాయికుట్టి సింగమ్, జుంగా వంటి చిత్రాల్లో మెరిసింది. గజినికాంత్ (భలే భలే మొగాడివోయ్ రీమేక్) మూవీ సమయంలో నటుడు ఆర్య ప్రేమలో పడిపోయింది ఈ చిన్నది.

ఆ తర్వాత వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి. వాటిని నిజం చేస్తూ.. 2019లో ఒక్కటయ్యారు ఈ జంట. అయితే అప్పట్లో వీరి పెళ్లి చర్చల్లో నిలిచింది. కారణం..వీరిద్దరి మధ్య 17 ఏళ్ల వయస్సు తేడా ఉండటమే. వీరికి అరియానా అనే పాప కూడా ఉంది. ఆర్య వరుడు మూవీతో చాలా గ్యాప్ తీసుకుని ఇటీవల సైంధవ్ మూవీతో మనల్ని పలకరించిన సంగతి విదితమే. టెడ్డీ, యువరత్న.. గత ఏడాది పట్టుదల అనే మూవీలో ఓ పాటలో కనిపించింది సాయేషా సైగల్. ఈ సాంగ్‌లో సరికొత్త అవతారంలో .. సందడి చేసింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఆర్య, కూతురు, ఇతర విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఆమె సినిమాల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sayyeshaa (@sayyeshaa)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి