iDreamPost
android-app
ios-app

తండ్రి మరణంతో సెలవు తీసుకున్న మహిళా ఉద్యోగి! బాస్ మెసేజ్ వైరల్!

  • Published Mar 30, 2024 | 3:13 PMUpdated Mar 30, 2024 | 3:16 PM

ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగస్థులకు సెలవులు ఇవ్వడంలో చాలా దారుణంగా ఉంటాయి. ఈ విషయమై చాలామంది ఉద్యోగస్థులు ఇప్పటికి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ ఉద్యోగి తన తండ్రి మరణించడంతో కొన్ని రోజులు ఆఫీస్ కు సెలవులు తీసుకుంది. అలా తీసుకోవడంతో.. తాను పని చేస్తున్న సంస్థ యాజమాని చేసిన పని పై ఆ మహిళ షాక్ కు గురైయ్యింది.

ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగస్థులకు సెలవులు ఇవ్వడంలో చాలా దారుణంగా ఉంటాయి. ఈ విషయమై చాలామంది ఉద్యోగస్థులు ఇప్పటికి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ ఉద్యోగి తన తండ్రి మరణించడంతో కొన్ని రోజులు ఆఫీస్ కు సెలవులు తీసుకుంది. అలా తీసుకోవడంతో.. తాను పని చేస్తున్న సంస్థ యాజమాని చేసిన పని పై ఆ మహిళ షాక్ కు గురైయ్యింది.

  • Published Mar 30, 2024 | 3:13 PMUpdated Mar 30, 2024 | 3:16 PM
తండ్రి మరణంతో సెలవు తీసుకున్న మహిళా ఉద్యోగి!  బాస్  మెసేజ్ వైరల్!

సాధరణంగా కార్పోరేట్, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుస్థులకు వర్క్ ఫ్రేజర్ తో పాటు సెలవులు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది ఆరోగ్యం బాలేకపోయినా, పండుగల వేళ అయినా ఇలా ఇతర ఏ అవసరాలకైనా కంపెనీలోని తమ పై అధికారులు సెలవులు ఇచ్చే విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. ఇక ఈ సెలవుల విషయం పై ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగస్థులు ఎప్పుడు అసంతృప్తితో ఉంటారు. కానీసం తమ కుటంబ సభ్యులకు బాగాలేకపోయినా, ఎవరైనా మరణించిన కూడా సెలవులు ఇవ్వడానికి వంద కారణాలు వెతకడం, అదనపు డ్యూటీలు చేయించడం వంటివి చేస్తూ.. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల సెలవులు ఇస్తారు. పోని ఆ ఇచ్చిన సెలవులు ఫ్రీగా ఉంటాయా అనుకుంటో.. అది కూడా ఉండదు. సెలవులకు తగ్గట్టు నెల జీతం కట్ చేసి మరి ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మహిళ ఉద్యోగి తన తండ్రికి బాగోకపోవడంతో.. ఆఫీసుకు కొన్నిరోజులు సెలవు తీసుకుంది. కానీ, ఆ తర్వాత ఆయన తండ్రి మరణించడంతో మరో 10 రోజులు అదనంగా తీసుకోవడంతో.. తాను పనిచేస్తున్న సంస్థ యాజమాని చేసిన పని పై ఆ మహిళ షాక్ కు గురైయ్యింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నిజానికి కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగస్థులకు సెలవులు ఇవ్వడంలో చాలా దారుణంగా ఉంటాయి. ఈ విషయమై చాలామంది ఉద్యోగస్థులు ఇప్పటికి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ మహిళా ఉద్యోగి ఓ ప్రముఖ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుంది. అయితే ఆ మహిళ.. తన తండ్రికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆఫీసుకు సెలవు తీసుకుంది. ఈ క్రమంలోనే.. ఆమె తన తండ్రిని హాస్పిటల్ లో చేర్పించి వైద్యం ఇప్పించినా ఆయన ప్రాణాలు దక్కలేదు. కాగా, హాస్పిటల్లో చికిత్స పొందుతూ తండ్రి మరణించడంతో.. మరో రెండు రోజులు అదనంగా తీసుకుంది. అలా మొత్తం మీదకి 10 రోజులు సదరు మహిళ ఉద్యోగి సెలవులు తీసుకుంది. ఇక తన తండ్రి కార్యక్రమాలన్ని పూర్తి చేసుకున్న తర్వాత.. ఆమె తిరిగి ఆఫీసుకు వెళ్లలి అనుకొనే లోపు ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఎందుకంటే.. ఆమెను ఉద్యోగంలో తొలగిస్తున్నానంటూ ఆమె బాస్ నుంచి ఆమెకు ఓ మెసెజ్ వచ్చింది. ఇక అందులో.. నేను నీ పరిస్థితిని అర్ధం చేసుకోగలను, ఈ సమయంలో ఇలాంటి మెసేజ్ పెడుతున్నందుకు నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. కానీ నేను ఒక కంపెనీకి యజమానిని.. మనం మన కెరీర్ లో పైకి ఎదగాలంటే ప్రతి రోజు కష్టపడుతూనే ఉండాలి. ఈ సమయంలో నీ అవసరం కంపెనీకి చాలా ఉంది. కానీ, మీరు ఇన్ని రోజులు లీవ్ లో ఉన్నారు కాబట్టి.. నేను నిజంగా మీ స్థానం ఏంటి అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అందుచేత నేను మిమ్మల్నీ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నా. ఇక  నీర్ణయం తీసుకోక తప్పడం లేదు. అయితే ఈ నిర్ణయం మీకు ఇబ్బందించి కలిగించినందుకు క్షమించండి  అంటూ మెసెజ్ ను పంపిచారు.

A female employee who took leave after the death of her father! Boss message viral! 1

అయితే ఈ విషయాన్ని సదరు మహిళ Reddit అనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇక ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు ఆ బాస్ విమర్శలు గుప్పుమనిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఆ మహిళ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా అలా ప్రవర్తించడం చాలా దారుణం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు తమకు ఆఫీసులో ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.మరి, తండ్రి చనిపోయాడని మహిళ ఉద్యోగి సెలవులు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తొలగించిన ఈ ఘనపై మీ అభిప్రాయాలనే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి