iDreamPost

ఆ చట్టం ఐటీ కంపెనీలకు వర్తించదు – తెలంగాణ హైకోర్టు

ఆ చట్టం ఐటీ కంపెనీలకు వర్తించదు – తెలంగాణ హైకోర్టు

ఐటీ కంపెనీ ఉద్యోగుల తొలగింపుపై స్పందించేందుకు కార్మిక శాఖకు ఎలాంటి అధికారం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఐటీ పాలసీ ప్రకారం నెలకొల్పే కంపెనీలు షాపులు మరియు స్థాపన చట్టం 1988 పరిధిలోకి రాదని చెబుతూ, ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఇండియా ప్రై.లిమిటెడ్‌ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేసిన పి.అప్పలనాయుడును 2013లో ఆ కంపెనీ వివరణ కోరకుండా తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంటూ 48(1) కింద కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అప్పలనాయుడు ఫిర్యాదును విచారించిన వికారాబాద్‌ కార్మిక శాఖ అధికారులు భాదితుడుకు 2017 ఏప్రిల్‌ వరకు జీతం చెల్లించాలని కాగ్నిజెంట్‌ కంపెనీని ఆదేశించింది. దీంతో హైకోర్టులో కార్మిక శాఖ ఆదేశాలను సవాల్ చేస్తు కంపెనీ అధికారులు రిట్ పిటీషన్ వేయగా కేసును విచారిచిన న్యాయమూర్తి ఐటీ కంపెనీలకు షాపులు మరియు స్థాపన చట్టం 1988 వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం 2002లోనే ఉత్తర్వులు జారీ చేసిందని చెబుతూ కాగ్నిజెంట్‌ కంపెనీ వాదనను న్యాయమూర్తి ఆమోదిస్తూ కేసులో తుదితీర్పు వెలువరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి