iDreamPost

థాంక్ యు 3 రోజుల వసూళ్లు – పాపం చైతు

చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇది నిలవడం ఖాయమంటున్నారు. నిన్న హైదరాబాద్ తో సహా చాలా చోట్ల కనీస జనం లేక షోలు క్యాన్సిల్ చేయడం మల్టీ ప్లెక్సుల్లోనూ కనిపించింది. మాములుగా ఆదివారం రోజు ఎంత బ్యాడ్ ఫిలిం అయినా సరే స్టార్ హీరో ఉంటే ఎంతో కొంత వసూళ్లు వస్తాయి.

చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇది నిలవడం ఖాయమంటున్నారు. నిన్న హైదరాబాద్ తో సహా చాలా చోట్ల కనీస జనం లేక షోలు క్యాన్సిల్ చేయడం మల్టీ ప్లెక్సుల్లోనూ కనిపించింది. మాములుగా ఆదివారం రోజు ఎంత బ్యాడ్ ఫిలిం అయినా సరే స్టార్ హీరో ఉంటే ఎంతో కొంత వసూళ్లు వస్తాయి.

థాంక్ యు 3 రోజుల వసూళ్లు – పాపం చైతు

రెండు రోజుల క్రితం విడుదలైన థాంక్ యుని ఆడియన్స్ మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశారు. కంటెంట్ గురించి టాక్ పాజిటివ్ గా రాకపోవడంతో పాటు శుక్ర శనివారాలు కురిసిన భారీ వర్షాలు ఇంకాస్త దెబ్బేశాయి. చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇది నిలవడం ఖాయమంటున్నారు. నిన్న హైదరాబాద్ తో సహా చాలా చోట్ల కనీస జనం లేక షోలు క్యాన్సిల్ చేయడం మల్టీ ప్లెక్సుల్లోనూ కనిపించింది. మాములుగా ఆదివారం రోజు ఎంత బ్యాడ్ ఫిలిం అయినా సరే స్టార్ హీరో ఉంటే ఎంతో కొంత వసూళ్లు వస్తాయి. దానికి భిన్నంగా థాంక్ యుకి మినిమమ్ ఆక్యుపెన్సీ లేకపోవడం బయ్యర్లను కలవరపెడుతోంది. ఆచార్య తర్వాత దీనికే ఆ పరిస్థితి చూశామంటున్నారు.

ఇక కలెక్షన్ల సంగతి చూస్తే ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు థాంక్ యు మూడు రోజులకు వసూలు చేసిన మొత్తం షేర్ రూపంలో కేవలం 3 కోట్ల 60 లక్షలు మాత్రమే. గ్రాస్ గా చూసుకున్నా ఏడు కోట్లు దాటలేదు. నైజాంలో 1 కోటి 15 లక్షలు, సీడెడ్ 32 లక్షలు, ఉత్తరాంధ్ర 42 లక్షలు, ఈస్ట్ గోదావరి 23 లక్షలు, వెస్ట్ గోదావరి 14 లక్షలు, గుంటూరు 18 లక్షలు, కృష్ణా 20 లక్షలు, నెల్లూరు 11 లక్షలు, కర్ణాటకతో పాటు రెస్ట్ అఫ్ ఇండియా 11 లక్షలు, ఓవర్సీస్ లో 74 లక్షలు వసూలయ్యింది. అమెరికాలోనూ ఈ సినిమాకు పరాభవం తప్పలేదు. మొత్తం మీద దిల్ రాజుకి ఎఫ్3 ఇచ్చిన ఆనందం ఇంత త్వరగా ఆవిరయ్యే సినిమా వస్తుందని ఊహించలేదు

ఇవాళ వీక్ డేస్ మొదలయ్యాయి కాబట్టి డ్రాప్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే. చాలా చోట్ల తీసేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా బిసి సెంటర్లలో ఇంకా తీసికట్టుగా ఉంది. గురువారం విక్రాంత్ రోనా, శుక్రవారం రామారావు ఆన్ డ్యూటీ వస్తున్నాయి కాబట్టి వాటి కోసం థాంక్ యుని తీసేయడం లాంఛనమే. ముందస్తు అగ్రిమెంట్లు చేసుకున్న థియేటర్లు మాత్రమే థాంక్ యుని కొనసాగించబోతున్నాయి. ఫలితం తెలుసుకునే ఎస్విసి టీమ్ సక్సెస్ సెలబ్రేషన్లు, ప్రెస్ మీట్లు లాంటివేవీ పెట్టలేదు. సోషల్ మీడియాలోనూ ఇటు చైతు కానీ అటు దర్శకుడు విక్రమ్ కుమార్ కానీ మౌనంగా ఉండటంతో దేనికి సంకేతమో అర్థమయ్యిందిగా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి