iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ రికార్డు బ్రేక్ చేసిన విజయ్! ఏ విషయంలో అంటే?

  • Author Soma Sekhar Published - 05:58 PM, Mon - 18 September 23
  • Author Soma Sekhar Published - 05:58 PM, Mon - 18 September 23
అల్లు అర్జున్ రికార్డు బ్రేక్ చేసిన విజయ్! ఏ విషయంలో అంటే?

ఇండియాలో క్రికెట్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న రంగమేదైనా ఉందంటే.. అది సినిమా రంగమే. మరి ఆ రంగానికి చెందిన హీరోలకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో మూవీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. వదలకుండా వెతికి మరీ చూస్తారు ఫ్యాన్స్. ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీకి చెందిన కొన్ని రికార్డులు బద్దలవుతూ ఉంటాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి సంబంధించిన ఆల్ టైమ్ రికార్డును కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘లియో’ మూవీ ద్వారా బ్రేక్ చేశాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం ‘పుష్ప2’. సుకుమార్ డైరెక్షన్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అమ్మోరు అవతారంలో ఐకాన్ స్టార్ విశ్వరూపాన్నే చూపాడు. ఇక ఈ పోస్ట్ ఇండియా వైడ్ గా ఓ ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ పిక్.. 33 నిమిషాల్లోనే 10 లక్షలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. దీంతో స్పీడ్ గా వన్ మిలియన్ లైక్స్ సాధించిన పోస్టర్ గా పుష్ప2 రికార్డు సృష్టించింది.

తాజాగా ఈ రికార్డును బ్రేక్ చేశాడు కోలీవుడ్ హీరో విజయ్. ‘లియో’ మూవీకి సంబంధించిన విజయ్ లుక్ ను మూవీ యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పోస్టర్ ను 32 నిమిషాల్లోనే 10 లక్షల మంది లైక్ చేశారు. దీంతో పుష్ప2 రికార్డు బ్రేక్ అయిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ట్విటర్ లో కూడా దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న లియో మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి టైమ్ లో విజయ్ ఈ రికార్డు సాధించడంతో.. దళపతి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి పుష్ప2 రికార్డు లియో బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişenbetHoliganbet Giriş