iDreamPost
android-app
ios-app

రెండు వారాలకు షకీల ఎన్ని లక్షల పారితోషికం తీసుకుందో తెలుసా?

  • Author Soma Sekhar Published - 05:20 PM, Mon - 18 September 23
  • Author Soma Sekhar Published - 05:20 PM, Mon - 18 September 23
రెండు వారాలకు షకీల ఎన్ని లక్షల పారితోషికం తీసుకుందో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 7 బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ దూసుకెళ్తోంది. నాగార్జున చెప్పినట్లుగానే ఈసారి సీజన్ ఉల్టాఫుల్టాగా ఉంది. ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ లోకి కొందరు డబ్బుకోసం వస్తే.. మరికొందరు పేరుకోసం వస్తారు. ఇక కొంతమందికి ఈ షో నుంచి పిలుపు వచ్చినా.. విమర్శల పాలవడం ఎందుకని బిగ్ బాస్ ఆఫర్ ని తిరస్కరిస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు రోజుకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు? అని తెలుసుకోవాలని చాలా మందికి ఆరాటం ఉంటుంది. తాజాగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన షకీలా పారితోషికం గురించిన వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

షకీలా.. బిగ్ బాస్ సీజన్ 7లో రెండు వారాలు హౌస్ లో కొనసాగి ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ రియాలిటీ షోలో పాల్గొనడం వల్ల ఆమెకు మంచి జరిగిందనే చెప్పాలి. ఇప్పటి వరకు షకీలా అనగానే అందరు శృంగార తారగానే చూశారు. కానీ బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఆమె అమ్మగా మారింది. హౌస్ లో పద్దతిగా రెడీ అవుతూ.. మిగతా హౌస్ మెంట్స్ తో మంచిగా మాట్లాడుతూ.. కుటుంబ పెద్దగా ఎంతో హుందాగా వ్యవహరించారు షకీలా. నామినేషన్స్ అనగానే షకీలా భయపడిపోయేది. చివరికి రెండో వారం నామినేషన్స్ లో ఉన్న ఆమె.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

అయితే బిగ్ బాస్ రెండు వారాలకు గాను షకీలాకు ఎంత మెుత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చాడు అనుకుంటున్నారు? ఆమె ఒక్క వారానికి మూడు లక్షల 75 వేల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె రెండు వారాలకు దాదాపు రూ. 7 లక్షలపైనే తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు రెండు వారాలకే ఇన్ని లక్షలా? అంటూ షాక్ అవుతున్నారు. మరి షకీలా తీసుకున్న రెమ్యూనరేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler