iDreamPost

8, 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. రెండేళ్ల పాటు!

RTC Good News To Students: పదో తరగతి పాసయ్యారా? కనీసం ఎనిమిదో తరగతి పాసైనా గానీ మీకు ఆర్టీసీ చక్కని అవకాశం కల్పిస్తుంది. బంగారు భవిష్యత్తు కోసం ఎదురుచూసేవారికి ఆర్టీసీ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది.

RTC Good News To Students: పదో తరగతి పాసయ్యారా? కనీసం ఎనిమిదో తరగతి పాసైనా గానీ మీకు ఆర్టీసీ చక్కని అవకాశం కల్పిస్తుంది. బంగారు భవిష్యత్తు కోసం ఎదురుచూసేవారికి ఆర్టీసీ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది.

8, 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. రెండేళ్ల పాటు!

పదో తరగతి అయిపోయింది. కొంతమంది ఇంటర్ లో చేరతారు. మరి కొంతమంది డిగ్రీలో చేరతారు. మరికొంతమంది మాత్రం ఏదైనా ఉపాధి పనులు చూసుకుంటారు. లేదా ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుని ఆ రంగాల్లో స్థిరపడతారు. ఇలా కొన్ని నెలలు ట్రైనింగ్ తీసుకుని స్కిల్స్ నేర్చుకుని పలు విభాగాల్లో స్థిరపడాలి అని అనుకునే వారికి.. ఆ స్కిల్స్ తో స్వయం ఉపాధి సృష్టించుకోవాలనుకునేవారికి ఇదే సరైన అవకాశం. అలాంటి విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎనిమిదో తరగతి గానీ, పదో తరగతి గానీ పాసైతే కనుక ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ట్రైనింగ్ ఇచ్చి బంగారు భవిష్యత్తుని కల్పించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోంది.

తెలంగాణలోని పలు ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్స్ లో ప్రవేశించేందుకు ఆర్టీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్, వరంగల్ లోని ఐటీఐ కాలేజీల్లో పలు ట్రేడ్స్ లో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. స్వయం ఉపాధి రంగంలో సెటిల్ అవ్వాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో జూన్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐటీఐలో మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, పెయింటర్, వెల్డర్ ట్రేడ్స్ లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఈ ఐటీఐ కోర్సులు ఒక వరం.

నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చి.. భవిష్యత్తు అందించడంతో పాటు తక్కువ సమయంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఐటీఐ కాలేజీలను ఏర్పాటు చేసింది. అనుభవం కలిగిన ఆర్టీసీ అధికారులు, నిపుణులతో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. వివిధ ట్రేడ్స్ లో ప్రవేశం పొందిన విద్యార్థులకు టీజీఎస్ ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీ షిప్ గా చేరే అవకాశం ఇస్తారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు కింద ఉన్న కళాశాల ఫోన్ నంబర్లను సంప్రదించండి.

మోటార్ మెకానిక్ వెహికల్ ట్రేడ్ లో 48 సీట్లు, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లో 24 సీట్లు, పెయింటర్ విభాగంలో 20 సీట్లు, వెల్డర్ విభాగంలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మోటార్ మెకానిక్ వెహికల్, పెయింటర్ విభాగాల వ్యవధి 2 ఏళ్లు కాగా మెకానిక్ డీజిల్, వెల్డర్ విభాగాల వ్యవధి ఒక ఏడాది పాటు ఉంటుంది. మోటార్ మెకానిక్ వెహికల్ ట్రేడ్ కి, మెకానిక్ డీజిల్ కి 10వ తరగతి అర్హత ఉండాలి. పెయింటర్ కి, వెల్డర్ కి 8వ తరగతి పాసై ఉండాలి.  

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 10

తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2024 కాంటాక్ట్ వివరాలు:

  • హెల్ప్ లైన్ నంబర్: 080 6850 7502
  • హెల్ప్ డెస్క్: tsitiadmission@gmail.com

కాలేజ్ ఫోన్ నంబర్లు:

  • హైదరాబాద్ ఐటీఐ కాలేజ్ ఫోన్ నంబర్లు: 91006 64452, 040-23450033
  • వరంగల్ ఐటీఐ కాలేజ్ ఫోన్ నంబర్లు: 98494 25319, 80081 36611 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి