iDreamPost
android-app
ios-app

కూతురి పెళ్లి కోసం లాకర్లో దాచిన రూ.18 లక్షలకు చెదలు!

కూతురి పెళ్లి కోసం లాకర్లో దాచిన రూ.18 లక్షలకు చెదలు!

చాలా మంది పైసా పైసా కష్టపడి సంపాదిస్తారు. అలా కూడబెట్టిన డబ్బులు కానీ, పెద్ద మొత్తంలో ఉన్న డబ్బును భద్రంగా ఉండేందుకు బ్యాంక్ లాకర్లో దాచుకుంటున్నారు. ఇక అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులను వెనక్కి తీసుకుంటారు. అయితే అచ్చం ఇలాగే ఓ మహిళ తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బంతా ఓ బ్యాంక్ లో దాచుకుంది. డబ్బు అవసరం ఉండడంతో ఆ వ్యక్తి ఇటీవల బ్యాంకు అధికారులను సంప్రదించింది. ఆఫీసర్స్ ఆ డబ్బు దాచిన లాకర్ ను ఓపెన్ చేసి చూడగా.. ఆ డబ్బుంతా చెదలు తినేశాయి. ఈ సీన్ చూసి బ్యాంకు అధికారులు, డబ్బు దాచుకున్న మహిళ షాక్ గురయ్యారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ లోని మొరదాబాద్ కు చెందిన ఓ మహిళ తన చిన్న కూతురి పెళ్లి కోసం పెద్ద మొత్తంలో డబ్బును కూడబెట్టింది. ఆ డబ్బంతా భద్రంగా ఉండేందుకు బ్యాంకులో దాచుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఆ మహిళ చాలా రోజుల క్రితం తన వద్ద ఉన్న దాదాపు రూ.18 లక్షల డబ్బును స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో దాచుకుంది. కట్ చేస్తే.. ఇటీవల ఆ మహిళ డబ్బు కావాలని బ్యాంకు అధికారులను సంప్రదించింది. దీంతో ఆ అధికారులు డబ్బు దాచిన ఆ లాకర్ ను ఓపెన్ చేసి చూడగా.. ఆ రూ.18 లక్షలను పూర్తిగా చెదలు తినేశాయి.

ఈ సీన్ చూసి ఆ బ్యాంకు అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న డబ్బు దాచుకున్న మహిళ కన్నీరు మున్నీరుగా విలపించింది. అనంతరం బ్యాంకు మేనేజర్ ఈ ఘటనపై స్పందించి విచారణ చేపట్టారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. చెదలు పాలైన రూ.18 లక్షల ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al