iDreamPost
android-app
ios-app

IPL 2024: ఘోర ఓటమి.. RCBని అమ్మేయండి! టెన్నిస్ దిగ్గజం సంచలన కామెంట్స్..

  • Published Apr 16, 2024 | 4:04 PM Updated Updated Apr 16, 2024 | 4:04 PM

సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంతో ఆ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సంచలన కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంతో ఆ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సంచలన కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024: ఘోర ఓటమి.. RCBని అమ్మేయండి! టెన్నిస్ దిగ్గజం సంచలన కామెంట్స్..

ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పరాజయాల పరంపర కోనసాగిస్తూనే ఉంది. తాజాగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన SRH టీమ్ 287 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. అయితే ఆర్సీబీ సైతం 262 రన్స్ కొట్టి.. చివరి వరకు విజయం కోసం పోరాడి, ఓడిపోయింది. దీంతో ఆర్సీబీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సంచలన కామెంట్స్ చేశాడు.

ఐపీఎల్ 2024 టైటిల్ ను సాధించాలని ఎన్నో ఆశలతో ఈ సీజన్ లోకి అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. సీజన్ మారింది కానీ ఆర్సీబీ ఆటతీరు, దురదృష్టం మాత్రం మారలేదు. గత సీజన్లలో కొనసాగించిన పరాజయాల సంప్రదాయాన్ని ఈ సీజన్ లో కూడా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక తాజాగా సన్ రైజర్స్ చేతిలో కూడా ఓడిపోవడంతో.. ఆర్సీబీపై విమర్శలు ఎక్కువైయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆర్సీబీ ఓటమిపై మహేశ్ భూపతి స్పందిస్తూ..”రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఇలాంటి టైమ్ లో బీసీసీఐ రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆర్సీబీని కొత్త ఫ్రాంచైజీకి అమ్మే దిశగా మేనేజ్ మెంట్ ఆలోచించాలి. క్రికెట్, ఫ్యాన్స్, ఆటగాళ్ల కోసం ఆర్సీబీ అమ్మకం చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే నా అభిప్రాయాం కాస్త భిన్నంగా ఉన్నా.. కఠిన నిర్ణయం తీసుకోకతప్పదు” అంటూ ఈ మేరకు మహేశ్ భూపతి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం టెన్నిస్ దిగ్గజం చేసిన ఈ కామెంట్స్ ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి మహేశ్ భూపతి చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.