iDreamPost
android-app
ios-app

వీడియో: ఇంటికి రమ్మని ప్రియుడిని పిలిచిన మాజీ లవర్.. తర్వాత బిగ్ ట్విస్ట్!

Bandlaguda Issue: ప్రేమించిన పాపానికి ప్రియుడికి బడితే పూజ జరిగిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ప్రాణాలు అరచేతిలతో పెట్టుకొని రక్షించండి మొర్రో అంటూ వీడియో రిలీజ్ పోస్ట్ చేశాడు.

Bandlaguda Issue: ప్రేమించిన పాపానికి ప్రియుడికి బడితే పూజ జరిగిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ప్రాణాలు అరచేతిలతో పెట్టుకొని రక్షించండి మొర్రో అంటూ వీడియో రిలీజ్ పోస్ట్ చేశాడు.

వీడియో: ఇంటికి రమ్మని ప్రియుడిని పిలిచిన మాజీ లవర్.. తర్వాత బిగ్ ట్విస్ట్!

ప్రేమించిన వారి కోసం దేనికైనా సిద్దపడతారు అంటారు. నిజమైన ప్రేమ దేన్నీ లెక్కచేయదు.. ఒకరికోసం ఒకరు త్యాగం చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ప్రేమ తెచ్చె తంటాలు అన్నీ ఇన్నీ కావు. కొన్నిసార్లు ప్రేమ కోసం ప్రాణ త్యాగాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంటికి రావాలని ఫోన్ చేసి ప్రియుడిని పిలిచింది.. లవర్ పిలిచిందని సంతోషంతో ఆఘమేఘాల మీద అక్కడికి వెళ్లాడు. తీరా ప్రేయసి ఇంటికి వెళ్లిన తర్వాత ప్రేమికుడు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చావు అంచుకు వెళ్లి వచ్చిన ఆ యువకుడు తనను రక్షించండి బాబోయ్ అంటూ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ యువకుడికి ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం..

ఇటీవల ఫోక్సో కేసులో జైలు జీవితం గడిపి ఇంటికి వచ్చిన తన ప్రియుడిని కలుసుకోవాలని లవర్ చేసిన ప్రయత్నం ఆ ప్రియుడి ప్రాణలమీదకు తెచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ కి చెందిన అబ్దుల్ సోహైల్ (25) అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికతో సంవత్సరం క్రితం ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు అబ్దుల్ ని మందలించారు. ఇటీవల ఒక కేసులో జైలుకు వెళ్లివచ్చడు అబ్దుల్. తన ప్రియుడు ఇంటికి వచ్చాడన్న విషయం తెలుసుకొని పదే పదే తన ఇంటికి రావాలని ఫోన్ చేసింది లవర్. ప్రేయసి పిలిచిందన్న సంతోషంతో అబ్దుల్ గోడ దూకి ఇంట్లోకి వెళ్లాడు. ఇద్దరూ లోకాన్ని మరిచి ప్రేమలో మునిగిపోయారు.

అంతలోనే బాలిక తండ్రి అక్కడికి వచ్చి ఇద్దరినీ చూసి షాక్ తిన్నాడు. కోపంతో రగిలిపోయాడు.. కర్రతో రక్తం వచ్చేలా అబ్దుల్ ని కొట్టాడు. అంతేకాదు బయటికి వెళ్లకుండా బంధించారు. దెబ్బలు తట్టుకోలేక అబ్ధుల్ గట్టిగా అరిచాడు.. అయినా ఫలితం లేకుండా పోయింది. తన ప్రియురాలి గదిలోకి వెళ్లి సెల్ ఫోన్ తో సెల్ఫీ తీసుకొని వీడియో రికార్డు చేశాడు. తను ఎక్కడ ఉన్నది.. ఏం జరిగింది అంతా వివరంగా తెలుపుతూ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమై ఆ యువకుడు ఇచ్చిన డిటేల్స్ లోకేషన్ కనుక్కొని ఆ ఇంటికి వెళ్లి రక్షించి బయటకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి