iDreamPost
android-app
ios-app

పిరి*యడ్స్ పెయిన్స్ తో నడవలేని స్థితిలో యువతి.. డెలివరీ బాయ్ చేసిన పనికి..

Woman From Ranchi- Food Delivery Boy: ఓ యువతి ఫుడ్ డెలివరీ బాయ్ గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారింది. అతను చేసిన పనికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు దక్కుతున్నాయి.

Woman From Ranchi- Food Delivery Boy: ఓ యువతి ఫుడ్ డెలివరీ బాయ్ గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారింది. అతను చేసిన పనికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు దక్కుతున్నాయి.

పిరి*యడ్స్ పెయిన్స్ తో నడవలేని స్థితిలో యువతి.. డెలివరీ బాయ్ చేసిన పనికి..

ప్రస్తుతం అందరి జీవన విధానం మారిపోయింది. ఏం కావాలి అన్నా ఇంటి వద్దకే వచ్చేస్తున్నాయి. గడప దాటి కాలు బయట పెట్టకుండానే మీకు కావాల్సిన ఏ వస్తువునైనా పొందవచ్చు. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ, నిత్యావసరాలకు సంబంధించి ప్రముఖ డెలివరీ సర్వీస్ ప్రొవైడర్స్ వేగంగా డెలివరీ చేసే స్వీసెస్ ని తీసుకొచ్చారు. అయితే ప్రతిసారి డెలివరీ ఎక్స్ పీరియన్స్ బాగుంటుంది అనడానికి లేదు. కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే లైఫ్ లో కొన్నిసార్లు అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అనుకోని వ్యక్తుల నుంచి ఊహించని సాయం కూడా అందుతుంది. అలాంటి ఒక ఘటన యువతి లైఫ్ లో జరిగింది. ఆ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో వేదకిగా పంచుకుంది.

సాధారణంగా మీరు ఆన్ లైన్ లో డెలివరీ బాయ్స్ మీద కంప్లైంట్లు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఫుడ్ ఆర్డర్ లేటుగా తెచ్చారనో.. ఫుడ్ పార్శిల్ సరిగ్గా లేదనో.. మా ప్యాకేజ్ ఓపెన్ చేసుంది, డెలివరీ బాయ్ లేటుగా వచ్చాడు, మా ఫుడ్ చల్లగా అయిపోయింది.. అబ్బో ఇలాంటి చాలానే ఫిర్యాదులు చూసుంటారు. కానీ, అప్పుడప్పుడు డెలివరీ బాయ్స్ ఔధార్యం, గొప్పతనం గురించి కూడా కొన్ని సంఘటనలు చూసే ఉంటారు. అలాంటి వాటి కోవలోకే ఈ ఘటన చేరుతుంది. ఒక యువతికి కలిగిన ఇబ్బందిని ఆ డెలివరీ బాయ్ తో పంచుకోగానే.. ఆమెకు కావాల్సిన సహాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. అంతేకాకుండా నెటిజన్స్ మన్ననలు కూడా పొందుతున్నాడు.

విషయం ఏంటంటే.. రాంచీలో ఉండే ఓ యువతి తన పిరి*యడ్స్ పెయిన్స్ తో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కుంటోంది. ఆమె కనీసం తన ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లలేనంతగా ఆ నొప్పులు వస్తున్నాయి. ఆ సమయంలో రాంచీలో ఎలాంటి మెడిసిన్ సర్వీసులు కూడా అందుబాటులో లేవంట. అలాగే స్విగ్గీ జీనీ సర్వీస్ కూడా ఆ సమయంలో పని చేయలేదు. ఇంక చేసేది లేక.. ఆ యువతి స్విగ్గీలో తనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. ఆ ఫుడ్ ని డెలివరీ బాయ్ పిక్ చేసుకున్న తర్వాత.. ఆ డెలివరీ ఏజెంట్ ను తనకు మెడిసిన్ కావాలి తీసుకురాగలరా అని అడిగింది. అతను అందుకు సరే అని ఆమెకు కావాల్సిన ట్యాబ్లెట్స్ ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ విషయాన్ని ఆ యువతి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నాకు ఇలాంటి ఇక ఒక పరిస్థితి వచ్చింది. ఎంతో మంచి వాడైనా డెలివరీ ఏజెంట్ నాకు సహాయం చేశాడు. అతనికి నేను టిప్ ఇస్తాను అంటూ తన అనుభవాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను చేసిన మంచి పనిని అంతా పొగిడేస్తున్నారు.