iDreamPost
android-app
ios-app

Sunny Leone : మంచు విష్ణు విషయంలో ఫెయిలయ్యానన్న సన్నీలియోన్.. వీడియో హ‌ల్‌చ‌ల్‌

  • Published Apr 08, 2022 | 5:59 PM Updated Updated Apr 08, 2022 | 6:04 PM
  • Published Apr 08, 2022 | 5:59 PMUpdated Apr 08, 2022 | 6:04 PM
Sunny Leone : మంచు విష్ణు విషయంలో ఫెయిలయ్యానన్న సన్నీలియోన్..  వీడియో హ‌ల్‌చ‌ల్‌

మంచు విష్ణు(Vishnu Manchu)తో బాలీవుడ్ నటి సన్నీలియోన్ నటిస్తోంది. ఈ సినిమాలో ‘గాలి నాగేశ్వరరావు’ అనే పాత్రను పోషిస్తున్నారు విష్ణు. సన్నీలియోన్ పాత్ర పేరు రేణుక. ఈ సినిమా షూటింగ్‌లో స‌ర‌దాగా విష్ణు, స‌న్నీలియోన్ క‌లిసి ఓ రీల్ వీడియో చేశారు.

విష్ణు మంచుతో చేసిన రీల్ వీడియో పోస్ట్ చేసిన స‌న్నీలియోన్ ‘మళ్లీ ఎపిక్ ఫెయిల్ అంటూ కామెంట్ కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో విష్ణును భ‌య‌పెట్ట‌డానికి, ఓ పిల్ల‌ర్ వెనుక మాస్కువేసుకొని స‌న్నీలియోన్ దాక్కుంది. అప్పుడు భ‌య‌ప‌డ‌ని విష్ణు, ఫేస్ మాస్కుతీయ‌గానే భ‌య‌ప‌డిన‌ట్లు యాక్ట్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ లో ‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి..’ పాట న‌డుస్తోంది. వీడియో వైర‌ల్ అవుతోందికాని, ట్రోలర్స్ మాత్రం ఇంత బతుకు బతికి రీల్ వీడియోలు చేసుకుంటున్నారా? అంటూ కామెంట్స్ చేస్తే, మ‌రికొంద‌రు సెటైర్లు వేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై ఈషాన్ సూర్య దర్శకత్వంలోతెరకెక్కుతోంది. పంజాబీ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ (Payal Rajput) ఈ చిత్రంలో మ‌రో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. కోన వెంక‌ట్ ఈ చిత్రానికి క‌థ, స్క్రీన్ ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఛోటా.కె.నాయుడు కెమెరా మేన్‌. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డిది మూల కథ.

ఇంకా టైటిల్ ఖ‌రారు కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డికానున్నాయి.

 

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş