iDreamPost
android-app
ios-app

వీడియో: వంట గదిలో ఉక్కపోతకు.. భలే చెక్ పెట్టాడు.. మీరూ ట్రై చేస్తారా?

Viral Video: అవసరం, సమస్య ఉంటేనే కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ఈ మండే ఎండలకు వంటగదిలో ఉక్కపోస్తోందా? అయితే ఇతను చేసిన ఐడియా మీకు ఏమైనా పనికొస్తుందేమో చూడండి.

Viral Video: అవసరం, సమస్య ఉంటేనే కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ఈ మండే ఎండలకు వంటగదిలో ఉక్కపోస్తోందా? అయితే ఇతను చేసిన ఐడియా మీకు ఏమైనా పనికొస్తుందేమో చూడండి.

వీడియో: వంట గదిలో ఉక్కపోతకు.. భలే చెక్ పెట్టాడు.. మీరూ ట్రై చేస్తారా?

ప్రస్తుతం అంతా మండే ఎండాకాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం 8 గంటలు దాటగానే పిచ్చ ఉక్కపోత, చెమటలు, వడగాలితో అల్లాడిపోతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రత అయితే కచ్చితంగా 40 డిగ్రీలు దాటేస్తోంది. బయటకు వస్తే భానుడి భగ భగలకు ప్రజలు బిత్తరపోతున్నారు. సామాన్యంగా ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ఇంట్లో ఉన్నా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. అవేంటంటే.. ఇల్లంతా ఏసీ ఉన్నా.. బెడ్ రూమ్లలో ఫ్యాన్లు ఉన్నా.. రెండు ప్రదేశాల్లో మాత్రం ఎండాకాలం ఉక్కపోతను అనుభవించక తప్పదు. ఒకటి వంటగది, రెండు వాష్ రూమ్. ఈ రెండుచోట్ల మాత్రం సగటు మానవుడు ఈ ఎండాకాలాన్ని ఫీలవ్వాల్సిందే.

ముఖ్యంగా వంటగదిలో ఉండే ఆడవాళ్లకి అసలు సిసలైన ఎండాకాలం అంటే ఏంటో తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఎండవేడి, మరోవైపు పొయ్యి వేడి. రెండింటికి ఒళ్లంతా తడిసి ముద్దవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కచ్చితంగా వంటగదిలో చెమటలను భరించక తప్పదు. సాధారణంగా సమస్య ఉంటేనే దానికి సొల్యూషన్ ఉంటుంది. ఏ ఆవిష్కరణ అయినా.. సమస్య, అవసరం నుంచే పుట్టుకొచ్చింది అయ్యి ఉంటుంది. అలాగే వంటగదిలో ఉండే ఉక్కపోతకు ఒక వ్యక్తి చక్కని పరిష్కారాన్ని కనుగొన్నాడు. నిజంగా అతని ఐడియా చూసి అంతా పిచ్చోళ్లై పోతున్నారు. యానిమల్ సినిమాలో లాగా వాటే థాట్, వాటే విజన్.. పిచ్చోళ్లు అయిపోతున్నారు అంటున్నారు.

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ విషయం అయినా ఇట్టే వైరల్ అవుతోంది. ముఖ్యంగా మనిషి అవసరాలకు పరిష్కారం చూపించే వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే అన్నీ మనకు ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ, చూసిన తర్వాత అరే భలే చేశాడే అనే అభిప్రాయం మాత్రం కలుగుతుంది. అలాంటి వీడియోనే ఇది కూడా. ఒక వ్యక్తి వంటగదిలో ఉక్కపోతకి చక్కని పరిష్కారాన్ని కనిపెట్టాడు. ఏం లేదు ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకుని ఒక స్టాండ్ కి ఫిక్స్ చేశాడు. దానిని టేపుతో తన శరీరానికి అంటించుకున్నాడు. నిజానికి ఇది ఫన్నీగా చేసిన వీడియో. కానీ, అతని ఐడియాకి మాత్రం నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. అతనికి ఎంత కష్టం రాకపోతే ఇంత బాగా ఆలోచిస్తాడు అంటూ పొగిడేస్తున్నారు. నిజానికి ఆలోచన చాలా కొత్తగా, కాస్త ఇబ్బందిగా కూడా ఉంది. ఆచరణ సాధ్యం కాకపోయినా కూడా చూసి నవ్వుకోవడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. మరి.. మీకు కూడా వంటగదిలో ఏదైనా ఇబ్బందిగా ఉన్నా, ఈ ఎండలకు వంటగదిలోకి వెళ్లలేము అనుకున్నా.. ఈ ఐడియాని ట్రై చేసి చూడండి. మరి.. ఈ వైరల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Audenio Santos (@_audeniosantos)