iDreamPost
android-app
ios-app

వీడియో: పుట్టినరోజు పార్టీకి పిలిచి మిత్రుడిని చితకబాదారు!

వీడియో: పుట్టినరోజు పార్టీకి పిలిచి మిత్రుడిని చితకబాదారు!

గతంలో బంధం ఏదైనా దానికి ఒక విలువ, స్థానం ఉండేవి. అదే స్నేహం అయితే ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేంతలా కలిసిమెలిసి ఉండేవారు. కానీ, ఈరోజుల్లో మాత్రం చాలా మంది అవసరం, అవకాశం కోసం మాత్రమే స్నేహం చేస్తున్నట్లు అనిపిస్తుంటుంది. చిన్న చిన్న కారణాలతో స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టేవాళ్లు కొందరైతే.. ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వాళ్లు ఇంకొందరు. అలాంటి ఒక బ్యాచ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పుట్టిన రోజని పిలిచి ఓ కుర్రాడిని చితకబాదారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ ఘటన మదనపల్లెలో జరిగింది. ఓ కుర్రాడిని తన ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీ ఉందని పిలిచారు. మిత్రులు పిలిచారని అతను కూడా వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక.. అతనిపై మిత్రులు దాడి చేయడం ప్రారంభించారు. విచక్షణారహితంగా కొట్ట సాగారు. అతను తనను కొట్టద్దు అని కాళ్లావేళ్లా పడ్డాడు. కానీ, వాళ్లు కనికరం లేకుండా అతడిని గొడ్డుని బాదినట్లు బాదారు. అతను నొప్పి తట్టుకోలేక ఆర్తనాదాలు పెట్టాడు. అయితే వాళ్లు అతనిపై దాడి చేయడానికి కారణం.. మరో ఫ్రెండ్ ని కొడుతుంటే వద్దు అని చెప్పాడంట. మంచికిపోతే చెడు ఎదురైందని.. కొట్టద్దు అని చెప్పినందుకు అతడినే ఘోరంగా కొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ అమానవీయ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet