iDreamPost
android-app
ios-app

వీడియో: వైరల్ ‘వడాపావ్ గర్ల్’ కొట్లాట.. ఢిల్లీ వీధుల్లో తల్లితో కలిసి..!

Vada Pav Girl Viral Video: ఢిల్లీ వీధుల్లో చాలా మందికి వడాపావ్ గర్ల్ అంటే తెలిసే ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి కూడా ఆమె సుపరిచితురాలే. కానీ, ఇప్పుడు ఈమె ఢిల్లీ వీధుల్లో ముష్టి యుద్ధానికి దిగింది.

Vada Pav Girl Viral Video: ఢిల్లీ వీధుల్లో చాలా మందికి వడాపావ్ గర్ల్ అంటే తెలిసే ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి కూడా ఆమె సుపరిచితురాలే. కానీ, ఇప్పుడు ఈమె ఢిల్లీ వీధుల్లో ముష్టి యుద్ధానికి దిగింది.

వీడియో: వైరల్ ‘వడాపావ్ గర్ల్’ కొట్లాట.. ఢిల్లీ వీధుల్లో తల్లితో కలిసి..!

సోషల్ మీడియాలో ఈ మధ్య కొంతమంది చాలా తర్వగా వైరల్ అయిపోతున్నారు. చేసే పనిని కాస్త విభిన్నంగా, కొత్తగా చేస్తూ త్వరగా ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. దానికి సోషల్ మీడియాలో బాగా ఉపయోగపడుతోంది. ఇటీవల బిల్ గేట్స్ ఇండియా వచ్చినప్పుడు నాగ్ పూర్ చాయ్ వాలాను కలిశాడు గుర్తుందా? డాలీ చాయ్ వాలా అని. అతను కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ అయిపోయాడు. అలాగే ఒక అమ్మాయి ఢిల్లీలో బాగా వైరల్ అయ్యింది. ఆమె పేరు చంద్రికా గేరీ దీక్షిత్. ఆమె వడాపావ్ గర్ల్ గా నెట్టింట పాపులర్. ఢిల్లీ వీధుల్లో ముంబయి టేస్ట్ తో వడాపావ్ విక్రయిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె వీధుల్లో కొట్లాటకు దిగిన వీడియో వైరల్ అయ్యింది.

వడాపావ్ గర్ల్ అంటే ఢిల్లీలో ఫేమస్ అనే చెప్పాలి. ఆమె ఒక వడాపావ్ బండి పెట్టుకుని.. ఆ పేరు మీద ఒక ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసి.. తాను చేసే బిజినెస్ ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తూ కాస్త వైరల్ అయ్యింది. ఆ తర్వాత డాలీ చాయ్ వాలాని కూడా కలిసింది. ఆ తర్వాత ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. అయితే ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది అంటారు. బిజినెస్ చేసే సమయంలో ఆమె కాస్త దురుసుగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది అంటారు. అలాంటి ఒక ప్రవర్తనే ఈసారి రోడ్లపై చూపించింది. చంద్రికా గేరీ దీక్షిత్, ఆమె తల్లి రోడ్డుపై కొందరితో గొడవకు దిగారు. ఆ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

వడాపావ్ గర్ల్ కొందరితో గట్టిగా మాట్లాడుతూ కనిపించింది. పక్కన ఆమె తల్లి ఒక స్కూటీ మీద కూర్చుని ఉంది. అక్కడున్న వాళ్లంతా తమ ఫోన్లలో వారి మాటలను, వారి ప్రవర్తనను చిత్రీకరిస్తూ ఉన్నారు. చంద్రికా తల్లి మాటలు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. కుక్కలతో మాట్లాడేందుకు కుక్కల్లా మారాల్సిందే అంటూ కామెంట్స్ చేసింది. వడాపావ్ గర్ల్ కూడా అక్కడున్న కుర్రాళ్లపైకి దూసుకెళ్తోంది. నన్ను కాదు మిమ్మల్ని ఇక్కడికి పంపిన వాళ్లని అడుగు అంటూ ఆమె చెప్పిన మాటలు వినిపిస్తున్నాయి. అప్పుడు వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by Vadapav Girl Delhi (@vadapav_girl_delhi)

ఆ తర్వాత మళ్లీ ఈ గొడవ స్టార్ట్ అయ్యింది. ఈసారి ఒక పెద్దావిడకు వడాపావ్ గర్ల్ కు వాగ్వాదం జరిగింది. ఆ మహిళ ఈ అమ్మాయి చున్నీ పట్టుకుంది. ఇద్దరూ కాస్త గట్టిగానే కేకలు వేసుకున్నారు. అక్కడున్న కొందరు కుర్రాళ్లు వచ్చి వీరిని విడదీశారు. వీళ్లిద్దరు పరస్పరం దాడి కూడా చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మొత్తం ఘటనపై నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంత త్వరగా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కూడా అంత మంచిది కాదు అంటున్నారు. అలాగే ముంబయి స్టైల్ వడాపావ్ ని ఢిల్లీ తెచ్చావ్.. కానీ, ఆ తరహా ప్రవర్తన ఇక్కడ నడవదు అంటూ హెచ్చరిస్తున్నారు. మొత్తానికి వడాపావ్ గర్ల్ బిజినెస్ తోనే కాకుండా.. కొన్ని కొన్ని వివాదాలతో కూడా వైరల్ అవుతోంది.