P Krishna
Womens Dancing Video: ఈ మధ్య కాలంలో రీల్స్, వీడియోలు చేస్తూ షార్ట్ టైమ్ లో సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. పాపులారిటీ కోసం కొంతమంది విపరీత చేష్టలు చేస్తూ వారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు.. ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు.
Womens Dancing Video: ఈ మధ్య కాలంలో రీల్స్, వీడియోలు చేస్తూ షార్ట్ టైమ్ లో సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. పాపులారిటీ కోసం కొంతమంది విపరీత చేష్టలు చేస్తూ వారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు.. ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు.
P Krishna
సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు అప్ లోడ్ చేసి వాటికి లైకులు, షేర్లు వస్తాయని.. తక్కువ సమయంలో తమకు మంచి పాపులారిటీ వస్తుందని ఎంతోమంది రక రకాల విన్యాసాలు, పాటలు, డ్యాన్స్‌లతో ఊదరగొడుతున్నారు. కొంతమంది శృతిమించి రీల్స్, వీడియోలు చేస్తూ పలువురికి నష్టం చేయడమే కాదు.. తమ ప్రాణాలు కూడా రిస్క్ లో పెడుతున్నారు. ఇటీవల కొంతమంది రోడ్లపై వాహనాలు నడుపుతూ, మెట్రో ట్రైన్, పార్కులు ఒక్కటేమిటి పబ్లిక్ ఉన్న ప్రదేశాల్లో రీల్స్, వీడియోలు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. ఇద్దరు మహిళలు కార్ డ్రైవ్ చేస్తూ వారు చేసిన పనికి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు కారులో ఏం చేశారో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి కొంతమంది రీల్స్, వీడియోలు చేస్తున్నారు. ఈ పిచ్చి చిన్న పెద్ద అనే తేడా లేకుండా పోయింది. లైకులు, షేర్ల కోసం ప్రమాదకర రీతిలో వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు కారులో కూర్చొని డ్యాన్స్ చేస్తున్నారు. దారుణం ఏంటంటే కారు డ్రైవ్ చేస్తున్న మహిళ స్టీరింగ్ వదిలి చేతులెత్తి డ్యాన్స్ చేయడం. మహింద్రా థఆర్ ఎస్‌యూవీ కారు నడుపుతూ ఇద్దరు మహిళలు చేసిన పనికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘజియాబాద్ – ఢిల్లీ జాతీయ రహదారి 9 లో కారులో వెళ్తున్న మహిళలు డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రముఖ జర్నలిస్ట్ నిశాంత్ శర్మ ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. కారు నడుపుతున్న ఇద్దరు మహిళలు డ్యాన్స్ చేయడం వాళ్లు సంతోషంగా ఉన్నా.. అది వారి ప్రాణాలకు మాత్రమే కాదు.. ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని గ్రహించకపోవడం శోచనీయం. రీల్స్ పిచ్చితో తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి నెలకొంది. స్టీరింగ్ వీల్ చేతిలో పట్టుకొని డ్యాన్స్ చేయడం.. ఆమె పక్కన మరో మహిళ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం అప్పటి వరకు ఆనందంగా ఉన్నా.. ప్రమాదం జరిగితే ఎంత నష్టమో వాళ్లకు అర్థం కాలేదు. ఇలాంటి విపరీత చేష్టలు ఉన్న వారిని ఏమనాలి? అంటూ ప్రశ్నించారు. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ డ్రైవ్ చేసే సమయంలో వారు డ్రింక్ చేసి ఉంటారు అని కొంతమంది, అలా డ్రైవ్ చేసిన వారిని పోలీసులు ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.
खुद तो मरेंगी दूसरों को और मारेंगी….!
यही कारण है हादसे का!…. तस्वीरें हैं नेशनल हाईवे NH 9 की… #गाजियाबाद से #दिल्ली तरफ जाते हुए।
छम्मक छल्लो गाने पर बनाई गई #Reel थार…UP14FR5113 #VideoViral हों रहा। गाड़ी @Uppolice @DelhiPolice #Ghaziabad #Delhi #NH9 pic.twitter.com/osicAoNJfq— निशान्त शर्मा (भारद्वाज) (@Nishantjournali) July 17, 2024