iDreamPost
android-app
ios-app

వీడియో: మెట్రోలో జంటతో ఆంటీల వాగ్వాదం.. ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలంటూ..!

వీడియో: మెట్రోలో జంటతో ఆంటీల వాగ్వాదం.. ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలంటూ..!

సాధారణంగా భారతదేశంలో బహిరంగంగా అమ్మాయి- అబ్బాయి చనువుగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించరు. పబ్లిక్ ప్లేసెస్ లో ముద్దులు పెట్టుకోవడం నేరం కూడా. అయితే ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ప్రేమ పేరిట, ప్రేమికుల పేరిట నానా రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే అలాంటి వీడియోలు కోకొల్లలు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో అయితే అబ్బాయిలు, అమ్మాయిలు మరీ బరితెగించి ప్రవర్తించడం చూశాం. ఇలాంటి పనులు చేయకూడదు అంటూ మెట్రో అధికారులు ప్రత్యేకంగా నోటీసులు కూడా అంటించారు. ఇప్పుడు ఆ కోవకు చెందిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

విషయం ఏంటంటే.. ఢిల్లీ మెట్రోలో యువత ఒకింత ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం, అమ్మాయి- అబ్బాయి ముద్దులు పెట్టుకోవడం వంటి వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాకే నెటిజన్స్ నెగిటివ్ గా స్పందించారు. అంతేగానీ మెట్రో ప్రయాణికులు మాత్రం స్పందించింది, ఖండించింది లేదు.

కానీ, ఇప్పుడు ఓ ఇద్దరు మహిళలు ఓ జంటను నిలదీశారు. అందరూ చూస్తుండగానే వారిపై విరుచుకుపడ్డారు. మీ ప్రవర్తన సరిగ్గా లేదంటూ వాదించారు. ఆ యువతీ యువకుడు మహిళలతో వాగ్వాదానికి దిగారు. మీరు పద్ధతిగా మాట్లాడండి అంటూ వాదించారు. మెట్రోలో ఇలా ప్రవర్తించడానిక సిగ్గుండాలి అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలో అంత వేడి ఉంటే ఇంటికి వెళ్లి చూసుకోండి అంటూ మహిళలు కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ వీడియోలో ఆ జంట తప్పుగా ప్రవర్తించినట్లు కనిపించలేదు. బహుశా గొడవ ప్రారంభం అయిన తర్వాత తీసిన వీడియోలా ఉంది.

యువకుడు కూడా మహిళలతో గట్టిగానే వాదనకు దిగాడు. మేము తప్పుగా ఏం ప్రవర్తించాము అంటూ ప్రశ్నించాడు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడద్దు అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు సరిగ్గా చెప్పారంటూ కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఆ మహిళలు అనవసరంగా నోరు పారేసుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss