iDreamPost
android-app
ios-app

వీడియో: పోలీస్ స్టేషన్ లో జుట్లు పట్టుకుని కొట్టేసుకున్న హిజ్రాలు!

వీడియో: పోలీస్ స్టేషన్ లో జుట్లు పట్టుకుని కొట్టేసుకున్న హిజ్రాలు!

హిజ్రాలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు మూకుమ్మడి దాడికి దిగారు. అది కూడా ఎక్కడో కాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు ఎదుటే నువ్వా నేనా అంటూ కొట్టేసుకున్నారు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో వారిని చూస్తూ ఉండిపోయారు. ఇష్టానుసారం.. విచక్షణ లేకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ యుద్ధ వాతావరణం నెలకొంది. హిజ్రాలు పోలీస్ స్టేషన్ ఆవరణలో రెచ్చిపోయారు. గ్రూపులుగా విడిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్టుకున్నారు. ఇదంతా ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన గొడవగా చెబుతున్నారు. ఒక గ్రూపునకు చెందిన హిజ్రాలు.. వేరే వాళ్లపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న మరో వర్గం వాళ్లు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. రెండు గ్రూపులు ఎదురు పడటంతో గొడవకు దిగారు.

తాము ఉన్న పోలీస్ స్టేషన్ అని కూడా మరిచిపోయి కొట్టేసుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు రువ్వుకున్నారు. కొందరైతే జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. హిజ్రాలు ఎక్కువ మంది ఉండటంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. అక్కడికీ అందరినీ వేరు చేసి ఘర్షణ సద్దుమణిగేలా చేశారు. తర్వాత రెండు గ్రూపులు పోటా పోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ తతంగం మొత్తం అక్కడున్న వాళ్లు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు కాస్తా వైరల్ గా మారాయి.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique