iDreamPost
android-app
ios-app

వీడియో: హెలికాప్టర్ నుంచి నోట్ల వర్షం.. ఏరుకోలేక అల్లాడిపోయిన జనం!

డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నా? నోట్ల కట్టలు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడతాయా? ఇలాంటి ప్రశ్నలు మీరు వింటూనే ఉంటారు. వాస్తవానికి అలాంటివి జరగవు అని మనకుకూడా తెలుసు. కానీ, ఇక్కడ మాత్రం కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. అది కూడా దాదాపు రూ.8 కోట్లు ఉంటాయి.

డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నా? నోట్ల కట్టలు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడతాయా? ఇలాంటి ప్రశ్నలు మీరు వింటూనే ఉంటారు. వాస్తవానికి అలాంటివి జరగవు అని మనకుకూడా తెలుసు. కానీ, ఇక్కడ మాత్రం కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. అది కూడా దాదాపు రూ.8 కోట్లు ఉంటాయి.

వీడియో: హెలికాప్టర్ నుంచి నోట్ల వర్షం.. ఏరుకోలేక అల్లాడిపోయిన జనం!

సాధారణంగా డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? డబ్బు కట్టలు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడతాయా? అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే అలాంటి ఘటనలు జరగవు అని అందరికీ తెలుసు. కానీ, అలాంటి ఒక అసాధరణ ఘటనే ఒకటి జరిగింది. ఏకంగా కోట్ల రూపాయలు ఆకాశం నుంచి వర్షంలా కురిసింది. అవి ఏరుకోలేక అక్కడున్న జనం పాపం ఎంతో కష్టపడిపోయారు. అదంతా ఫేక్ మనీ అనుకుంటే మీరు పొరపడినట్లే. అదంతా అసలు సిసలైన డబ్బే. ప్రస్తుతం ఆ ఘటనకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చెక్ రిపబ్లిక్ లోని నాడ్ లాబెమ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ నుంచి నోట్ల వర్షం కురిసింది. వాటిని చేజింక్కించుకునేందుకు ప్రజలు పరుగులు పెట్టారు. ఇన్ ఫ్లుఎన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ ఈ పని చేశాడు. మిలియన్ డాలర్ల(దాదాపు రూ.8 కోట్లు) కరెన్సీని ఒక కంటైనర్ లో పెట్టి.. హెలికాప్టర్ సాయంతో గాల్లోకి తీసుకెళ్లి అక్కడి నుంచి డాలర్లను జార విడిచాడు. ఇదంతా చూసిన తర్వాత ఎందుకు అతనికేమైనా పిచ్చా? అనే ప్రశ్న మీ మదిలోకి రావచ్చు. అయితే అతను ఇదంతా ఒక కారణంతోనే చేశాడు. కమిల్ ఒక పోటీ నిర్వహించాడు. అందులో విజయం సాధించిన వారికి ఈ మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ పోటీలో ఎవరూ విజయం సాధించలేదు. దాంతో ఈ డబ్బును పాల్గొన్న అందరికీ పంచిపెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు.

కజామా చిత్రం వన్ ‘మ్యాన్ షో ది మూవీ’ అనే సినిమా చూసి అందులో ఉన్న కోడ్ ని డీకోడ్ చేయాలి అని కమిల్ పోటీ పెట్టాడు. అయితే అందులో పాల్గొన్న ఎవరూ కూడా ఆ కోడ్ ని డీ కోడ్ చేయలేకపోయారు. దాంతో ఆ డబ్బును పాల్గొన్న అందరికీ పంచేయాలి అని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా అందరికీ ఇ-మెయిల్స్ పంపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నగపు పంచుతామంటూ చెప్పారు. పోటీలో పాల్గొన్న వాళ్లంతా బ్యాగులు భుజాన వేసుకుని చెప్పిన చోటుకి వచ్చేశారు. ఇంకేముంది కమిల్ ఒక హెలికాప్టర్ కి డబ్బు కంటైనర్ ని తగిలించాడు. గాల్లోకి వెళ్లిన తర్వాత చెప్పిన ప్రదేశంలో డబ్బు వర్షం కురిసేలా కంటైనర్ తలుపు తెరిచాడు. ఇంకేముంది.. మిలియన్ డాలర్లు అలా గాల్లో రెపరెపలాడుతూ నేలమీద పడ్డాయి.

కరెన్సీ నోట్లను ఏరుకునేందుకు కింద ఉన్న జనం ఎగబడ్డారు. ఎవరికి వాళ్లు బ్యాగులు తీసుకుని ఆ డాలర్లను ఏరుకున్నారు. కొందరైతే గొడుగుల సాయంతో డబ్బును సేకరించారు. కాస్త కష్టమైన పర్లేదు అని డబ్బు మొత్తాన్ని ఏరుకుని సంచిలో వేసుకున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వీడియోలో బంధించి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రపంచంలోనే మొదటి నిజమైన నోట్ల వర్షం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ మనీ రెయిన్ లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. మరి.. కమిల్ బార్డో షేక్ కురిపించిన ఈ నోట్ల వర్షంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kazma Kazmitch (@kazma_kazmitch)