iDreamPost

RTC MD Sajjanar:బస్సు పైకెక్కి రీల్స్‌లో పోజులు .. చివరికి సజ్జనార్ చేతుల్లో.!

  • Published Dec 29, 2023 | 6:32 PMUpdated Dec 29, 2023 | 6:32 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో తమ టాలెంట్ ను చూపించుకునే వారు కోకోల్లలు. ఉదయం లేచిన దగ్గరనుంచి ప్రతి ఒక్కరు సామజిక మాద్యమాలలోనే మునిగి తేలుతూ ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని వింత వీడియోలు తీసే వారిపై సజ్జనార్ తగిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో తమ టాలెంట్ ను చూపించుకునే వారు కోకోల్లలు. ఉదయం లేచిన దగ్గరనుంచి ప్రతి ఒక్కరు సామజిక మాద్యమాలలోనే మునిగి తేలుతూ ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని వింత వీడియోలు తీసే వారిపై సజ్జనార్ తగిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు.

  • Published Dec 29, 2023 | 6:32 PMUpdated Dec 29, 2023 | 6:32 PM
RTC MD Sajjanar:బస్సు పైకెక్కి రీల్స్‌లో పోజులు .. చివరికి సజ్జనార్ చేతుల్లో.!

ఎలాగైనా ఎదో ఒకటి చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ముఖ్యంగా యూత్ ఈ విషయంలో వారి హద్దులు దాటుతున్నారని చెప్పి తీరాలి. వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కదులుతున్న రైల్ మీద, బస్ మీద, లేదా రద్దీగా ఉన్న ట్రాఫిక్ లో ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని చూసి మరొకరు అలానే చేయడం.. వాటిని ట్రెండ్ చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి కంటే.. ఇలా యువతను తప్పు ద్రోవ పట్టించే వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బస్సు ఎక్కి రీల్స్ చేస్తున్న ఓ యువకుడిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తగిన చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలం నాగుదేవులపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి సారతేజ. ఇతను డిగ్రీ చదువుతున్న ఓ కాలేజీ స్టూడెంట్. అయితే, ఎలాగైనా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఫాల్లోవర్స్ ను పెంచుకోవాలని.. నర్సాపూర్ డిపో పరిధిలోని కొన్ని RTC బస్సులపై ఎక్కి తన ప్రతిభను చూపిద్దాం అనుకున్నాడు. అనుకున్నట్టుగానే రన్నింగ్ బస్సును వెనుక నుంచి ఎక్కి ఒక రీల్ చేసి అతని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇతను చేసిన రీల్స్ అన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అవి కాస్త ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకు చేరాయి.

reels on bus top

దీనితో సజ్జనార్ ఆ యువకుడిని పిలిపించి ఇలాంటి పనులు చేస్తున్నందుకు మందలించారు. అంతే కాకుండా అతనికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి విన్యాసాలు చేస్తే ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇలా తమకు ప్రమాదం కలిగించే రీల్స్ చేస్తూ ప్రాణహాని కలిగించుకోవద్దని పేర్కొన్నారు. ఇలాంటి విన్యాసాలు చేసినపుడు పొరపాటున ఏమైనా జరిగితే.. ఇంట్లో తల్లి తండ్రులు ఎంత బాధపడతారు అనే విషయాన్ని గుర్తుచేశారు. ఇక సజ్జనార్ చెప్పిన మాటలకు ఆ యువకుడు తన తప్పు తెల్సుకున్నాను అంటూ.. ఇలాంటి రీల్స్ ను ఇంకెప్పుడు చేయను అంటూ.. మీరు కూడా ఇటువంటి రీల్స్ చేయకండి అని.. మరొక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, ఇటువంటి కౌన్సిలింగ్ అనేది ఇప్ప్పుడు చాలా మంది యువతకు అవసరం అని చెప్పి తీరాలి. మరి, ఈ యువకుడి విషయంలో సజ్జనార్ తీసుకున్న చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి