iDreamPost
android-app
ios-app

ఎప్పుడూ నవ్వుతుండే సౌమ్యరావ్ జీవితంలో ఇంత విషాదం దాగుందా?

ఎప్పుడూ నవ్వుతుండే సౌమ్యరావ్ జీవితంలో ఇంత విషాదం దాగుందా?

జబర్దస్త్ నుంచి యాంకర్ అనసూయ తప్పుకున్న తర్వాత ఆ స్థానంలోకి ఎవరు వస్తారు? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఎవరి ఊహకు అందకుండా యాంకర్ గా తెలుగు సీరియల్స్ లో పేరు తెచ్చుకున్న కన్నడ నటి సౌమ్య రావుని తీసుకొచ్చారు. మొదట్లో కాస్త తెలుగులో ఇబ్బంది పడినా ఆ తర్వాత అందరిపై పంచులు వేస్తూ బాగానే పాపులర్ అయింది. అయితే అంతటి అలాంటి చలాకీ యాంకర్ లైఫ్ లో ఎంతో విషాదం దాగుంది.

అందం, అభినయం, చలాకీతనం అన్నీ కలిపితే యాంకర్ సౌమ్య రావులా ఉంటుంది అనచ్చు. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె బాగానే పాపులర్ అయ్యింది. తర్వాత శ్రీదేవీ డ్రామా కంపెనీలో కూడా అప్పుడప్పుడు మెరుస్తూ వస్తోంది. స్పెషల్ ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తోంది. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో ఆదికి పెళ్లి చూపులు అంటూ కాన్సెప్ట్ తో వచ్చారు. అందులో సౌమ్య రావుకి ఆదికి కెమిస్ట్రీ వర్కౌట్ చేశారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. సౌమ్యను ఇంప్రెస్ చేసేందుకు ఆది ఒక గిఫ్ట్ ఇస్తాడు.

అది ఓపెన్ చేసిన తర్వాత అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వాళ్లందరి కళ్లు చెమ్మగిల్లాయి. ఎందుకంటే ఆది సౌమ్యరావ్ ఆమె తల్లితో కలిసున్న ఫొటో గిఫ్ట్ చేశాడు. సౌమ్య రావు తల్లి బ్రెయిన్ క్యాన్సర్ తో మూడేళ్లు పోరాడి కాలం చేశారు. తెలుగులో చాలా మంది ఈ విషయం ఇప్పటి వరకు తెలీదు. ఈ ప్రోమో చూసిన తర్వాత అభిమానులు కూడా ఆమె జీవితంలో ఇంతటి విషాదం దాగుందా అని బాధపడుతున్నారు. లైఫ్ లో దేనికీ బాధ పడద్దని.. ఫైట్ చేస్తూ సాగిపోవాలంటూ కామెంట్ చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş