iDreamPost
android-app
ios-app

వీడియో: టికెట్ లేకుండా రైలెక్కిన బీజేపీ నేత.. ఇంతే కాకుండా..!

  • Published Oct 16, 2023 | 5:22 PM Updated Updated Oct 16, 2023 | 5:22 PM
  • Published Oct 16, 2023 | 5:22 PMUpdated Oct 16, 2023 | 5:22 PM
వీడియో: టికెట్ లేకుండా రైలెక్కిన బీజేపీ నేత.. ఇంతే కాకుండా..!

ఇటీవల ఓ పోలీస్ ఆఫీసర్ టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన విషయం తెలిసిందే. దీంతో టీటీఈ వెంటనే అతడి వద్దకు వెళ్లి గట్టిగానే ప్రశ్నించాడు. దీంతో మొత్తానికి అతడు పోలీస్ ఆఫీసర్ తో వాగ్వాదానికి దిగి తర్వాత స్టేషన్ లో దించిశాడు. అయితే ఈ ఘటన మరువకముందే ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఓ రాజకీయ నేత టికెట్ లేకుండానే రైలు ఎక్కాడు. ఇంతే కాకుండా అతడు ఏం చేశాడో తెలుసా? దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారింది.

బీహార్ కు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు రాణా ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఇటీవల బక్సర్ కు వెళ్లేందుకు టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లాక రైలులోకి టీటీఈ వచ్చాడు. టికెట్ ఎక్కడా అని అతడిని ప్రశ్నించాడు. దీనికి ప్రతాప్ సింగ్ సమాధానం చెప్పకుండా అతనితో వాగ్వాదానికి దిగాడు. ఇంతే కాకుండా నేను టికెట్ తీసుకోను., ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగాడు. ఇదంతా గమనించిన కొందరు ప్రయాణికులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలు సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన కొందరు నెటిజన్స్.. ఆ రాజకీయ నాయకుడి తీరుపై మండి పడుతున్నారు. టికెట్ లేకుండా రైలు ఎక్కి బెదిరింపులకు దిగిన ప్రతాప్ సింగ్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibombetcio giriş