iDreamPost

మహిళలు పొట్టి దుస్తులు ధరించడంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

మహిళలు పొట్టి దుస్తులు ధరించడంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

మహిళలపై ఏదైనా అఘాయిత్యం జరిగితే చాలు.. ముందుగా ప్రస్తావించేది వారి వస్త్రధారణ గురించే. మహిళల ధరించే దుస్తులను బట్టి వారి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తుంటారు కొందరు. శరీరం కనిపించేలా పొట్టి బట్టలు వేసుకోవడం వల్లే.. మగాడు రెచ్చిపోతున్నాడని, అందుకు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయంటూ కొన్ని నోళ్లు జడ్జ్ చేస్తుంటాయి. ఈ విషయంలో ఆడపిల్లలకు అండగా నిలవాల్సిన మహిళలు సైతం ఇవే నిందలు వేస్తూ.. వారిని మరింత కుంగదీస్తుంటారు. అయితే మహిళల వస్త్రధారణపై బొంబే హైకోర్టు ఇప్పుడు సంచలన తీర్పు ఇచ్చింది. పొట్టి బట్టలు వేసుకున్నంత మాత్రానా అది అశ్లీలతగా పరిగణించలేమని పేర్కొంది.

పొట్టి దుస్తులు ధరించడం, రెచ్చగొట్టే విధంగా డ్యాన్స్ చేయడం లేదా హావ భావాలు ప్రకటించడం అశ్లీలత చర్యగా పేర్కొనలేమని బొంబే హైకోర్టులోని నాగ్ పూర్ బెంచ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నాగ్ పూర్‌లోని తిర్ఖురాలోని రిసార్ట్‌లోని బాంక్వెట్ హాల్‌ రైడ్స్ చేసి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేసింది. ఈ ఏడాది మే నెలలో తిర్ఖురాలోన టైగర్ ప్యారడైజ్ రిసార్టు, వాటర్ పార్క్‌పై పోలీసుల బృందం దాడి చేయగా.. పొట్టి దుస్తుల్లో ఆరుగురు మహిళలు.. కొద్ది మంది ప్రేక్షకుల కోసం నృత్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఆ సమయంలో అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తున్నారని, ప్రేక్షకులు.. వారిపై రూ. 10 నకిలీ నోట్లను విసురుతున్నారని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసి పలు సెక్షన్లను పేర్కొన్నారు.

ఈ కేసు హైకోర్టులోని నాగ్ పూర్ బెంచ్ విచారణ చేపట్టగా.. ఆ సెక్షన్ ఏ సందర్భానికి వర్తిస్తుందో వెల్లడింది. సెక్షన్ 249 ప్రకారం.. బహిరంగంగా అశ్లీల నృత్యాలు చేసినా, పాటలు, పదాలు మాట్లాడినా, విన్నా ఇతరులు ఇబ్బందికి కలిగిందని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయొచ్చునని పేర్కొంది. ప్రస్తుత కాలంలో మహిళలు పొట్టి దుస్తులు ధరించడం చాలా సాధారణం, ఆమోదమని పేర్కొన్న కోర్టు.. సినిమాల్లో ఈ తరహా దుస్తులను తరచుగా చూస్తుంటాం కదా అని చెప్పింది. అందాల పోటీల్లో కూడా ఈ తరహా దుస్తులు వేస్తారని గుర్తు చేస్తూ.. అశ్లీలతపై సంకుచిత దృక్పథంతో వ్యవహరిస్తే తిరోగమన చర్య అవుతుందని పేర్కొంటూ ఆ కేసు కొట్టి వేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి