iDreamPost
android-app
ios-app

వీడియో: సితార గొప్ప మనసు.. మహేశ్- నమ్రతలపై ప్రశంసలు!

  • Published Oct 01, 2023 | 11:07 AM Updated Updated Oct 01, 2023 | 11:07 AM
  • Published Oct 01, 2023 | 11:07 AMUpdated Oct 01, 2023 | 11:07 AM
వీడియో: సితార గొప్ప మనసు.. మహేశ్- నమ్రతలపై ప్రశంసలు!

ఘట్టమనేని సితార.. ఇన్నాళ్లు మహేశ్- నమ్రత కుమార్తెగా ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ.. ఇప్పుడు మాత్రం తనకంటూ సొంత ఐడెంటీని క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవలే ఒక జ్యూవెలరీ యాడ్ లో కూడా చేసి.. అందరినీ మెప్పించింది. భవిష్యత్ లో సినిమాల్లో నటింస్తుందని మహేశ్ దంపతులు గతంలోనే ప్రకటించారు. అయితే సితార తన తండ్రి వారసత్వాన్ని కేవలం నటనలోనే తీసుకోవడం లేదు.. సేవా కార్యక్రమాల్లో కూడా తండ్రిని మించిన కుమార్తెగా ప్రశంసలు అందుకుంటోంది.

ప్రస్తుతం సితార పేరు నెట్టింట వైరల్ అవతోంది. తాజాగా ఓ మాల్ లో మ్యాక్స్ స్టోర్ ని ప్రారంభించేందుకు నమ్రత- సితార అతిథులుగా వెళ్లారు. కార్యక్రమం పూర్తైన తర్వాత మ్యాక్స్ బ్రాండ్ అక్కడున్న ముసలివాళ్లకు దుస్తులు అందజేసింది. వాటిని సితార చేతుల మీదుగా అందజేశారు. స్టేజ్ మీదకు చాలామంది ముసలివాళ్లు వచ్చారు. ఒక పెద్దావిడ స్టేజ్ మీదకు ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్నట్లు ఉండటంతో.. స్వయంగా సితార వెళ్లి ఆమె చేయి పట్టుకుని స్టేజ్ మీదకు తీసుకొచ్చింది. అలాగే అక్కడున్న ముసలివాళ్లను పలకరిస్తూ వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ సరదాగా గడిపింది. గిఫ్టులు ఇచ్చిన తర్వతా ఒక పెద్దావిడ సితారను ముద్దుపెట్టుకుని ఆశీర్వదించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ మహేశ్- నమ్రతలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పిల్లలను ఎలా పెంచాలో నమ్రత- మహేశ్ లను చూసి నేర్చుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా మహేశ్ బాబు మంచితనం, సమాజ సేవకు ఎంతో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు సితార ప్రవర్తించిన తీరు చూసి.. మంచితనంలో మహేశ్ బాబుని కూడా మించిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్స్, మహేశ్ బాబు అభిమానులు అందరూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. సోషల్ సర్వీస్ లోనూ సితార మహేశ్ కు ఏమాత్రం తీసిపోదు. తొలిసారి నటించిన జ్యూవెలరీ యాడ్ కు సితారకు రూ.కోటి వరకు రెమ్యూనరేషన్ దక్కినట్లు సమాచారం. ఆ మొత్తాన్ని సితార ఛారిటీకి ఇచ్చిన విషయం తెలిసిందే. మరి.. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş