iDreamPost
android-app
ios-app

తోకతో పుట్టిన చిన్నారి.. ఆశ్చర్య పోయిన డాక్టర్స్!

  • Published Mar 16, 2024 | 5:38 PM Updated Updated Mar 16, 2024 | 5:38 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు అనేక రకాల కారణాల వలన.. వింత వింతగా జన్మిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ శిశువు తోకతో పుట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు అనేక రకాల కారణాల వలన.. వింత వింతగా జన్మిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ శిశువు తోకతో పుట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 16, 2024 | 5:38 PMUpdated Mar 16, 2024 | 5:38 PM
తోకతో పుట్టిన చిన్నారి.. ఆశ్చర్య పోయిన డాక్టర్స్!

సాధారణంగా సృష్టిలో ఉండే జీవులలో జంతువులకు తోకలు ఉంటాయి. మనుషులకు తోకలుండవు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం అప్పుడే పుట్టిన పిల్లలు వింత వింతగా జన్మిస్తున్నారు. అపుడపుడు కొందరు పిల్లలు జంతువుల పోలికలతో జన్మించారన్న వార్తలను చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా ఇలాంటిదే. అప్పుడే పుట్టిన ఓ బిడ్డ తోకను కలిగి ఉండడం వలన .. ఈ విషయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పురిటి నొప్పులు కారణంగా ఓ మహిళ ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆ మహిళకు విజయవంతంగా ఆపరేషన్ చేశామని భావించేలోపే.. ఆ బిడ్డను చూసి డాక్టర్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ బిడ్డ తోకతో జన్మించింది. ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగింది.. ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్నీ తెలుసుకుందాం.

ఈ సంఘటన చైనాలోని.. హాంగ్‌జౌ ప్రావిన్స్‌లోని ఓ హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. నెలలు నిండిన ఓ మహిళకు ఆపరేషన్ చేసి .. బిడ్డను బయటకు తీసిన డాక్టర్స్ ఆ బిడ్డను చూసి షాక్ అయ్యారు. ఆ శిశివు జన్మించిన కొద్దిసేపటికే.. ఆ బిడ్డకు తోక ఉండడాన్ని గమనించాం అని.. చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ న్యూరోసర్జరీ డిప్యూటీ చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ లీ.. పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే ఇది జెన్యూ పరమైన కారణాల వలనే వచ్చిందని డాక్టర్స్ భావిస్తున్నారు. అసలు ఆ తోక ఎందుకు వచ్చిందా అని.. దానికి ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించి పూర్తి వివరాలు సేకరించారు.

ఈ క్రమంలో వెన్నుపాము చుట్టూ ఉన్న టిష్యూస్ తో ఈ తోక అనుసంధానం అయి ఉందని గుర్తించారు. సాధారణంగా అయితే, ఈ తోక వెన్నుముక కింద ఉండాలి. కానీ, ఇది అలా లేదు. అంతేకాకుండా ఎముకలు లేకుండా ఉన్న ఆ తోక సుమారు సుమారు 10 సెంటీ మీటర్లు అంటే 3.9 అంగుళాల పొడవు ఉందని తెలిపారు. పైగా ఆ తోక నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తుందని కూడా పేర్కొన్నారు. అయితే, ఆ తోకను తొలగించడం సాధ్యం కాదని.. ఆ తోక బిడ్డతో పాటు అలానే ఉంటుందని.. ఒకేవేళ తొలగించే ప్రయత్నం చేస్తే అది బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అని.. వైద్యులు స్పష్టం చేశారు. మరి, చైనాలో జరిగిన ఈ వింత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.