P Krishna
Mother Puts Son Risking Life: ఈ మధ్యకాలంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆనందం కోసం దేనికైనా తెగబడుతున్నారు. ఓ తల్లి తన కొడుకు ప్రాణాలు రిస్క్ లో పెట్టి థ్రిల్ రైడ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Mother Puts Son Risking Life: ఈ మధ్యకాలంలో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆనందం కోసం దేనికైనా తెగబడుతున్నారు. ఓ తల్లి తన కొడుకు ప్రాణాలు రిస్క్ లో పెట్టి థ్రిల్ రైడ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
P Krishna
నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తన పిల్లలను కంటికి రెప్పలా సాకుతుంది. పిల్లకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లి ప్రాణాలు విల విలలాడిపోతుంది.. తన కంట కన్నీరు చిందిస్తుంది. భూమిపై దేవుడు తనకు బదులుగా తల్లిని సృష్టించాడని అంటారు. ఈ భూమిపై తల్లి ప్రేమ విలువ కట్టలేనిది. అలాంటిది ఓ తల్లి తన కొడుకు ప్రాణాలు రిస్క్ లో పెట్టి థ్రిల్ రైడ్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లల సంతోషాల కోసం ఇలాంటి రిస్క్ రైడ్ చేయడం.. కొడుకు ప్రాణాలతో చెలగాటం ఆడటం అంత అవసరమా? అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బెంగుళూర్ లో జరిగినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా వచ్చిప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి. పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ తో వీడియోలు, రీల్స్ చేస్తూ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం డేంజర్ స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ జంట తమ కుమారుడిని స్కూటీపై థ్రిల్ రైడ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఘటన బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో జరిగినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై చాలా మంది నెటిజన్లు నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. తల్లి తన కుమారుడిని ఫుట్ రెస్ట్ పై నిల్చోబెట్టి నిర్లక్ష్యంగా ప్రయాణిస్తుంది. ఈ సంఘటన వెనుక వైపు ప్రయాణిస్తున్న వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల తల్లిదండ్రులు తమ పిల్లలను సంతోషం కోసం రిస్క్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కార్లు, బైక్ లపై ఎక్కించి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం.. ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కడం లాంటివి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు అంటున్నారు. కుమారుడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ తల్లిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆ బాలుడు కిందపడిపోతాడు.. పక్క నుంచి ఏదైనా వాహనం ఢీ కొడితే పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి దిక్కుమాలిన రిస్కీ థ్రిల్ రైడ్ అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Childrens learn what they see 👀
This is not at all cool !#RecklessDriving #RoadSafety pic.twitter.com/BvduheYY61— Lokendra Singh #iVoteForSure on 13th May’24 (@HYDTrafficMan) April 17, 2024