iDreamPost
android-app
ios-app

వీడియో: ఐఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. ఏం చేసిందంటే?

  • Published Jan 19, 2024 | 9:12 PM Updated Updated Jan 19, 2024 | 9:12 PM

ఈ మద్య కోతులు ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. గ్రామాల్లో కోతుల సమూహంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మనుషుల వద్ద నుంచి వస్తువులు ఎత్తుకెళ్లడం, ఇంట్లోకి చొరబడి తినుబండారాలు తీసుకోపోవడం.. ఇలా నానా రచ్చ చేస్తున్నాయి.

ఈ మద్య కోతులు ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. గ్రామాల్లో కోతుల సమూహంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మనుషుల వద్ద నుంచి వస్తువులు ఎత్తుకెళ్లడం, ఇంట్లోకి చొరబడి తినుబండారాలు తీసుకోపోవడం.. ఇలా నానా రచ్చ చేస్తున్నాయి.

  • Published Jan 19, 2024 | 9:12 PMUpdated Jan 19, 2024 | 9:12 PM
వీడియో: ఐఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. ఏం చేసిందంటే?

ప్రపంచంలో ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. మార్నింగ్ వాక్ నుంచి మొదలు రాత్రి ఇంటికి చేరే వరకుు నిత్యం ఏదో ఒక అప్ డేట్ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి.. వాటిని మనం వీక్షిస్తూనే ఉంటాం. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది కళాకారులు తమ టాలెంట్ తో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలోని జరిగితే వింతలు.. విశేషాలు చూసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలో కొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి.. మరికొన్ని కన్నీరు పెట్టించేలా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. తాజాగా ఓ కోతి చేసిన చిలిపి పనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

కోతులు చేసే చిలిపి పనులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మనుషులను భయపెట్టిస్తాయి.. కడుపుబ్బా నవ్విస్తాయి. సాధారణంగా కోతుల సమూహం అడవులు, గ్రామాలు, ఆలయాల వద్ద ఎక్కువగా ఉంటాయి. గ్రామాల్లో ఉండే కోతులు ఇళ్లల్లోకి చొరబడి తిండి పదార్థాలు ఎత్తుకెళ్లి తింటాయి. లేదంటే చెట్లపై దొరికే పండ్లు తిని బతుకుతాయి. ఆలయాల వద్ద ఉండే కోతులు భక్తులు ఇచ్చే ప్రసాదాలు తింటూ జీవిస్తాయి. కొన్నిసార్లు భక్తుల వద్ద నుంచి లాక్కెళ్లిపోతుంటాయి. ఈ మద్య ఆహారం మాత్రమే కాదు.. వస్తువులు సైతం ఎత్తుకెళ్తున్నాయి. అప్పుడప్పుడు కోతులు చేసే చిలిపి పనుల గురించి చూస్తూనే ఉంటాం. యూపీలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

యూపీలోని వృందావన్ గుడిలో ఓ కోతి హల్ చల్ చేసింది. ఐఫోన్ చేతిలో పట్టుకొని వెళ్తున్న వ్యక్తి చేతి నుంచి ఫోన్ ఎత్తుకెళ్లిపోయింది. ఆ కోతి ఫోన్ పట్టుకొని శ్రీరంగనాథ్ జీ గోడపై కూర్చుని ఉండటంతో వేరే కోతులు అక్కడికి వచ్చాయి. కింద నుంచి భక్తులు ఆ కోతి ఫోన్ కిందపడేలా చేయడానికి నానా తిప్పలు పడ్డారు. కొంత మంది పండ్లు, వేరే సెల్ ఫోన్లు విసిరారు.. కానీ ఆ కోతి మాత్రం చాలా సేపటి వరకు ఫోన్ ఇవ్వలేదు. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న ఫ్రూటీ ప్యాకెట్ విసిరాడు.. ఫ్రూటీని అందుకున్న కోతి సెల్ ఫోన్ కిందకు విసిరింది. కింద ఉన్న ఓ వ్యక్తి కోతి విసిరిన ఐఫోన్ ని చాకచక్యంగా క్యాచ్ పట్టాడు. మొత్తానికి ఇక దొరకదేమో అనుకున్న సెల్ ఫోన్ తిరిగి చేతికి రావడంతో ఆ వ్యక్తి సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vikas🧿 (@sevak_of_krsna)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss