iDreamPost
android-app
ios-app

వీడియో: ఈమెకు భూమి మీద నూకలు ఎక్కువే.. పక్కనే సిలిండర్ పేలినా..

  • Published Jun 11, 2024 | 6:05 PM Updated Updated Jun 11, 2024 | 6:05 PM

LPG Cylinder Explodes: సాధారణంగా మహిళలు వంట చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని అంటుంటారు. ముఖ్యంగా సిలిండర్ వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంటుంటారు.

LPG Cylinder Explodes: సాధారణంగా మహిళలు వంట చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని అంటుంటారు. ముఖ్యంగా సిలిండర్ వాడకం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంటుంటారు.

  • Published Jun 11, 2024 | 6:05 PMUpdated Jun 11, 2024 | 6:05 PM
వీడియో: ఈమెకు భూమి మీద నూకలు ఎక్కువే.. పక్కనే సిలిండర్ పేలినా..

ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్విస్తుంటే.. కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి. సాధారణంగా ఆడవాళ్లు వంట చేసే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతుంటారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాల మీదకు వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కానీ కొంతమంది మహిళలు గ్యాస్ సిలిండర్ వాడకం విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు.. ఫలితంగా ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. తాజాగా సోషల్ మీడియోలో ఓ మహిళ పక్కన సిలిండర్ పేలిన భయానక దృశ్యం వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా మహిళలు వంట చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని అంటారు. కొన్నిసార్లు వేడి నూనె మీద పడవొచ్చు, గ్యాక్ కుక్కర్, సిలిండర్ అకస్మాత్తుగా పేలిపోతున్న ఘటనలు ఎన్నో జరిగాయి. ఇటీవల అలాంటి షాకింగ్ ఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ట వైరల్ అవుతుంది. కిచెన్ లో పనిచేసుకుంటున్న ఓ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలింది.. క్షణాల్లో ఆ ఇళ్లంతా భయాణకంగా మారిపోయింది. విచిత్రం ఏంటంటే ఆ మహిళ మాత్రం కొద్ది నిమిషాల్లోనే తేరుకొని అక్కడ నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది.

ఈ భయాణక ఘటన ఇంట్లో అమర్చిన సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.దీన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కవ జరిగిందన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ వీడియో మాత్రం @klip_ent ఖాతా ద్వారా ట్విట్టర్ లో షేరే చేశారు. ఈ వీడియోని ఇప్పటి వరకు 34 వేల మంది వీక్షించారు. మహిళలు చాలా వరకు ఓపెన్ ఏరియాలో గ్యాస్ సిలిండర్ ఉండేలా చూడాలని సలహా ఇచ్చారు.. ఇలాంటి ప్రమాదాల్లో చాలా మంది చనిపోయారు.. కానీ అక్క నూకలు ఇంకా భూమ్మీద ఉన్నాయ్.. అందుకే క్షేమంగా బయటపడిందని కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet Girişİmajbetcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobet