Swetha
సాధారణంగా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగితే.. గాయపడ్డవారిని రక్షించడం అనేది చూస్తూ ఉంటాం. అయితే, ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మాత్రం యాక్సిడెంట్ అయిన ప్రదేశంలోనే చోరీ జరిగింది.
సాధారణంగా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగితే.. గాయపడ్డవారిని రక్షించడం అనేది చూస్తూ ఉంటాం. అయితే, ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మాత్రం యాక్సిడెంట్ అయిన ప్రదేశంలోనే చోరీ జరిగింది.
Swetha
ప్రస్తుతం చలికాలం కావడంతో పొగ మంచు దట్టంగా కప్పేస్తోంది. దీనితో హైవేలపై వాహనాలను నడిపే వారికి మరిన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయి. పొగమంచు కారణంగా రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. సహజంగా ఎవరైనా రోడ్ ప్రమాదానికి గురైతే..చుట్టూ ఉన్న వారు అక్కడి పరిస్థితులకు తగిన చర్యలు తీసుకుంటారు. వారిని పరామర్శించడం, పరిస్థితిని బట్టి వారిని ఆసుపత్రికి తరలించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ, తాజాగా ఆగ్రా వెళ్లే రహదారిలో అయిన యాక్సిడెంట్ ఘటనలో మాత్రం.. స్థానికులు అదే వాహనంలో ఉన్న కోళ్ల దొంగతనానికి పాల్పడ్డారు. దానికి సంభందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతంలో పొగమంచు ఎక్కువగా ఉండడంతో ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై కొన్ని వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనాలలో ఆగ్రా నుంచి కాస్గంజ్‌కు వెళ్తున్న ఓ కోళ్ల ట్రక్కు కూడా ఉంది. ఓ వైపు ఈ దుర్ఘటన కారణంగా ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉంటే.. అక్కడి స్థానికులు, ఇతర వాహనదారులు మాత్రం అవేం పట్టనట్టు.. పడిపోయిన కోళ్ల ట్రక్కులో నుంచి కోళ్లను తీసుకెళ్లడం మొదలెట్టారు. ఆ వాహనం అద్దాలు బద్దలుకొట్టి మరి, ఒకరినొకరు తోసుకుంటూ చేతికి దొరికిన కోళ్ళని దొంగలించి పారిపోయారు. ఆ ట్రక్కు డ్రైవర్ వాటిని తీసుకెళ్లొద్దు అంటూ విజ్ఞప్తి చేసినా.. అతని మాటలు ఎవరు పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పదింస్తున్నారు. కనీసం మానవత్వం చాటుకోని అక్కడి స్థానికుల పట్ల విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ జరిగిన ఘోర ప్రమాదంలో ఆ ట్రక్కు డ్రైవర్ సునీల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తనని కాపాడమని, ఆ కోళ్లను వదిలేయమని ఆ డ్రైవర్ ఎంత వేడుకున్నా సరే, స్థానికులు మాత్రం ఎవరు పట్టించుకోలేదు. దీనితో ఆ డ్రైవర్ దగ్గరలో ఉన్న జేవార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడి పోలీసులకు తన బాధను వ్యక్తపరిచాడు. ఈ ఘటనతో తనకు భారీ నష్టం కలిగింది అంటూ.. వారు చోరీ చేసిన కోళ్ల విలువ దాదాపు రూ. 2.5 లక్షల విలువ ఉంటుందంటూ ఆ డ్రైవర్ వాపోయాడు. దీనితో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తగిన చర్యలు తీసుకున్నారు. గాయపడ్డ ఆ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి అక్కడి స్థానికులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏదేమైనా, ఘోర రోడ్డు ప్రమాదానికి గురి అయ్యి బాధితులు తీవ్ర అవస్థలు పడుతుంటే.. స్థానికులు మాత్రం అవేం పట్టనట్టు చోరీకి యత్నించడం అనేది చాలా విచారించతగిన విషయం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In UP’s Agra, a lorry carrying chickens met with an accident in a road pile up due to dense fog. Commuters can be seen grabbing chickens and fleeing from the spot. Some bundled them in sack. pic.twitter.com/hBUaFCjj7g
— Piyush Rai (@Benarasiyaa) December 27, 2023