iDreamPost
android-app
ios-app

మెట్రోలో యువకుడి చెంప చెల్లుమనిపించిన యువతి.. వైరల్ వీడియో!

మెట్రోలో యువకుడి చెంప చెల్లుమనిపించిన యువతి.. వైరల్ వీడియో!

సాధారణంగా మెట్రో అనేది ప్రయాణాల కోసం అని అందరికీ తెలిసింది. ఏ నగరంలో చూసినా గమ్యస్థానాలు చేరేందుకు ప్రయాణికులు మెట్రో ఎక్కుతారు. కానీ, ఎందుకో తెలీదు.. ఢిల్లీ మెట్రోలో మాత్రం వైరల్ అవడం కోసమే ఎక్కుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎంతోమంది ఇప్పుడు ఢిల్లీ మెట్రో ద్వారానే నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇప్పటి వరకు యువతీ యువకులు ముద్దులు పెట్టుకుంటూ హల్ చల్ చేశారు. మొన్నీ మధ్య అయితే ఇద్దరు యువకులు కొట్టుకున్నారు. ఇప్పుడు మరో యువతీ, యువకుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.

సాధారణంగా ఢిల్లీ మెట్రోలో అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంతగా హెచ్చరించినా ప్రయాణికులు మాత్రం పట్టించుకోవడం లేదు. వారి ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. హద్దు మీరి ముద్దులు పెట్టుకుంటూ నానా హంగామా చేస్తున్నారు. అలా చాలా మందే వైరల్ అయ్యారు. ఇప్పుడు మరో యువతీ యువకుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే వాళ్లు గొడవ కారణంగా హల్ చల్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో ఒక యువకుడు నిల్చుని ప్రయాణం చేస్తున్నాడు.

అతని వద్దకు ఓ యువతి హడావుడిగా వెళ్లి గొడవకు దిగింది. అతడిని చెంప మీద కూడ కొట్టింది. అతను ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినా.. బూతులతో రెచ్చిపోయింది. అక్కడున్న తోటి ప్రయాణికులు అలా చూస్తిండిపోయారు. ఓ వ్యక్తి వీడియో తీయగా నెట్టింట వైరల్ గా మారింది. అది వారి మధ్య వ్యక్తిగత గొడవగా భావించి చాలా మంది దూరంగా ఉండిపోయారు. అలా ఆ గొడవలో వేలు పెట్టనందుకు ప్రయాణికులను నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. కారణం ఏదైనా.. ఒక వ్యక్తిని అలా పబ్లిక్ లో కొట్టడం కరెక్ట్ కాదని వారిస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet