iDreamPost
android-app
ios-app

వీడియో: ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానిక ఎగబడ్డ జనం. ఎక్కడంటే?

  • Published May 07, 2024 | 9:48 AM Updated Updated May 07, 2024 | 9:54 AM

Fish Rain: అప్పుడప్పుడు ప్రకృతిలో వింతలు చూస్తుంటే ఔరా అనిపిస్తుంది. వర్షాలు పడుతున్న సమయంలో ప్రకృతిలో ఎన్నో మార్పులు కనిపిస్తుంటాయి.. అప్పుడప్పుడు ఆకాశం నుంచి మంచు రాళ్లు మాత్రమే కాదు.. చేల వర్షం కూడా కురుస్తుంది.

Fish Rain: అప్పుడప్పుడు ప్రకృతిలో వింతలు చూస్తుంటే ఔరా అనిపిస్తుంది. వర్షాలు పడుతున్న సమయంలో ప్రకృతిలో ఎన్నో మార్పులు కనిపిస్తుంటాయి.. అప్పుడప్పుడు ఆకాశం నుంచి మంచు రాళ్లు మాత్రమే కాదు.. చేల వర్షం కూడా కురుస్తుంది.

వీడియో: ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానిక ఎగబడ్డ జనం. ఎక్కడంటే?

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరిగే వింతలు, విడ్డూరాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు ప్రకృతిలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి.. వాటిని చూసి ఆశ్చర్యపోవాల్సిందే.. మనకేం అర్థం కాదు. సాధారణంగా వడగండ్ల వాన పడే సమయంలో పెద్ద సైజ్ మంచు రాళ్లు పడుతుంటాయి. ఇది అందరికీ తెలిసిందే.. కానీ కొన్నిసార్లు ఆకాశం నుంచి చేపలు, కప్పలు పడుతుంటాయి. అయితే నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకాంర.. ఆకాశం నుంచి చేపలు, కప్పల వర్షం పడటం శాస్త్రీయంగా సాధ్యమే అంటున్నారు. ఇవి తప్పుడు ప్రచారాలు కాదని చెబుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో అకాశం నుంచి పెద్ద చేపల వర్షం పడుతుంది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చేపల వర్షం ఎక్కడ కురిసింది..? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

భారీ వర్షాలు పడే సమయంలో అప్పుడుప్పుడు ఆకాశం నుంచి చేపల వర్షం కురుస్తున్న వీడియోలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇరాన్ వాసులకు ఈ అనుభవం ఎదురైంది. ఎప్పుడు వేడితో సతమతమయ్యే ఇరాన్ ప్రజలు వర్షాలతో తడిసి ముద్దయ్యారు. ప్రస్తుతం ఇరాన్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే యసుజ్ ప్రాంతంలో భారీ వర్షంతో పాటు రోడ్డు పై చేపల వర్షం కురిసింది. దాదాపు కిలో నుంచి రెండు కిలో బరువు ఉన్న చేపలు రోడ్డు పై పడటంతో వాహనదారులు, పాదాచారులు మొదట షాక్ అయినా.. తర్వాత చేపలను ఏరుకునేందుకు పోటీ పడ్డారు. ఈ ఘటనను ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త తెగ వైరల్ అయ్యింది.

ఇరాన్ లో ఇలాంటి సంఘటన చూడటం చాలా ఆశ్చర్యం వేస్తుందని.. చేపల వర్షం కురవడం నా జీవితంలో ఇదే మొదటి సారి అంటున్నారు కొంతమంది స్థానికులు. అయితే చేపల వర్షం కురియడం శాస్త్రీయమే అంటున్నారు నిపుణులు. దీనికి గల కారణం భారీ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదరు గాలులు వీస్తుంటాయి. ఆ సుడిగాలులు సముద్ర, నది, సరస్సులు, చెరువుల గుండ ప్రయాణించడం వల్ల ఆ సుడిగాలిలో చేపలు, కప్పలు, ఇతర జలచర జీవులు గాల్లో ఎగిరి కిందపడిపోతుంటాయి. దీన్ని చాలా మంది వర్షంగానే భావిస్తుంటారు.. అందుకే చేపల వర్షం అని అంటుంటారు.