iDreamPost
android-app
ios-app

వీడియో: ఆవుపై సింహం దాడి.. ఎదురెళ్లి సింహాన్ని పరిగెత్తించిన రైతు!

వీడియో: ఆవుపై సింహం దాడి.. ఎదురెళ్లి సింహాన్ని పరిగెత్తించిన రైతు!

అడవులను నరుక్కుంటూ ఇళ్లు కట్టుకుంటూ పోవడం, అడవుల్లో జంతువులకు ఆహారం లభించకపోవడం.. ఇలా కారణం ఏదైనా వన్యప్రాణులు నివాస స్థలాల మధ్యకు వస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు ఇళ్ల మధ్యకు రావడం, ఇళ్లలో పెంచుకునే ప్రాణులపై దాడులు చేయడం వాటి ప్రాణాలు తీయటం కూడా చూశాం. ఏనుగులైతే పంటలు మొత్తాన్ని ధ్వంసం చేస్తుంటాయి. తాజాగా ఓ సింహం రోడ్డుపై వెళ్తున్న ఆవుపై దాడికి దిగింది. దాని ప్రాణాలు తీసి ఆకలి తీర్చుకోవాలని చూసింది. కానీ, అక్కడే దాని యజమాని ఉండటంతో ఆవు ప్రాణాలు మిగిలాయి.

సాధారణంగా సింహం అనగానే ముందు మన ప్రాణాలు కాపాడుకోవాలి అని చూస్తుంటారు. కానీ, ఆ రైతు మాత్రం అలా కాకుండా తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆవు ప్రాణాలు కాపాడేందుకు ముందుకెళ్లాడు. ఈ ఘటన గుజరాత్ లో జరిగినదిగా తెలుస్తోంది. జునాగఢ్ కేశోధ్ కు చెందిన కార్పొరేటర్ ఈ వీడియో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన గిర్ సోమనాథ్ జిల్లాలో జరిగినట్లు వెల్లడించారు. కొందరు కారులో వెళ్తుండగా ఒక సింహం ఆవుపై దాడి చేస్తూ కనిపించింది. ఎవరూ కారు దిగే ప్రయత్నం చేయలేదు. పాపం ఆవు అనుకుంటూ వీడియో రికార్డు చేస్తుండిపోయారు.

కానీ, ఆవు యజమాని మాత్రం అలా చేయలేదు. ఎలాగైనా తన ఆవు ప్రాణాలు కాపాడుకోవాలని చూశాడు. సింహాన్ని బెదిరించేందుకు ఏమైనా దొరుకుతుందా అని వెతికాడు. అక్కడ ఏదై రాయి కనిపించడంతో దానిని చేతిలోకి తీసుకున్నాడు. సింహం ఎప్పుడైతే ఆవును అలా వదిలిందో.. వెంటనే దానివైపు వేగంగా నడిచి కొట్టబోతున్నట్లు బెదిరించారు. అది చూసిన సింహం వెంటనే పరుగు తీసింది. ఆ రైతు తెగువను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఆవు ప్రాణాలు కాపాడుకునేందుకు సింహానికే ఎదురెళ్లిన రైతు ఎంతో ధైర్యశాలి అంటున్నారు. హ్యాట్సాఫ్ రైతన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabetganobet