Tirupathi Rao
What Is Snake Venom Addiction: బిగ్ బాస్ విన్నర్ కేసు తర్వాత అందరూ స్నేక్ వెనమ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఈ స్నేక్ వెనమ్? దానిని ఎందుకు వాడుతున్నారు?
What Is Snake Venom Addiction: బిగ్ బాస్ విన్నర్ కేసు తర్వాత అందరూ స్నేక్ వెనమ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఈ స్నేక్ వెనమ్? దానిని ఎందుకు వాడుతున్నారు?
Tirupathi Rao
పలు సందర్భాల్లో రేవ్ పార్టీలు అంటే వినే ఉంటారు. ఈ పార్టీలు బాగా డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు చేసుకుంటారు అంటారు. ఈ పార్టీలు సాధారణం కంటే భిన్నంగా ఉంటాయి. ఇందులో మందు, చిందు మాత్రమే కాకుండా.. అంతకు మించి ఉంటుంది. అశ్లీల నృత్యాలు, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఇలా అనేక రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పార్టీల్లో స్నేక్ వెనమ్ అనే పదం బాగా వినిపిస్తోంది. స్నేక్ వెనమ్ అంటే అదేదో కొత్తది కాదు. అందరికీ తెలిసిన పాము విషమే. మరి.. అంత ప్రమాదకరమైన విషాన్ని పార్టీల్లో ఏం చేస్తున్నారు? అసలు ఆ విషాన్ని ఎందుకు వాడుతున్నారు? అసలు స్నేక్ వెనమ్ కథేంటో చూద్దాం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక పేరు బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే స్నేక్ వెనమ్. ఇటీవల బిగ్ బాస్ హిందీ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అతడిని అక్రమంగా స్నేక్ వెనమ్ సరఫరా చేస్తున్నాడు అనే ఆరోపణలతో అరెస్టు చేశారు. అతని విచారణలో పలు కీలక విషయాలు కూడా వెల్లడయ్యాయి. ఈ నేపథ్యలోనే అసలు స్నేక్ వెనమ్ అంటే ఏంటి అని అంతా వెతుకులాట మొదలు పెట్టారు. రేవ్ పార్టీల్లో ఈ స్నేక్ వెనమ్ ని ప్రమాదకర రీతిలో వినియోగిస్తున్నారు. దీనిని కూడా ఒక మత్తు పదార్థంగా మార్చేసి వాడేస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. అతిగా పాము విషాన్ని వాడితో అనేక రుగ్మతలకు కూడా లోనవుతారు. దీనికి అడిక్ట్ అయిపోతారు. ఇలా అడిక్ట్ అవ్వడాన్ని అఫిడిజం అంటారు.
ప్రపంచం మొత్తంలో 3500 రకాల పాము జాతులు ఉన్నాయి. అయితే అవన్నీ ప్రమాదకరం కాదు. వాటిలో కేవలం 25 శాతం పాములు మాత్రమే ప్రమాదకర విషాన్ని ఉత్పత్రి చేస్తాయి. వాటితోనే మనిషి ప్రాణానికి హాని జరుగుతుంది. మనదేశంలో ఉండే పాము జాతుల్లో నాగుపాము విషం ఎంతో ప్రమాదకరం. ఈ నాగుపాము విషానికి రేవ్ పార్టీల్లో బీభత్సమైన డిమాండ్ ఉంటుంది. దీని ధర రూ.కోట్లల్లో కూడా పలుకుతూ ఉంటుంది. డ్రగ్స్ మాఫియాలో స్నేక్ వెనమ్ ఎంతో ప్రమాదకరమైంది. ఈ స్నేక్ వెనమ్ ని కొన్ని పద్ధతుల్లో పౌడర్ రూపంలోకి ప్రాసెస్ చేస్తారు. దానిని రేవ్ పార్టీల్లో సేవిస్తూ ఉంటారు. కాకపోతే దీనిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకుంటారని చెప్తున్నారు.
ఈ పౌడర్ లో వాడే న్యూరోటాక్సిన్ల ప్రభావం వల్ల తీసుకున్న వారు బాగా హై ఫీలవుతారు. దాని ప్రభావం ఐదు గంటల నుంచి ఐదారురోజుల వరకు ఉంటుంది. ఈ స్నేక్ వెనమ్ పౌడర్ తీసుకోవడం వల్ల ఎంతో శక్తివంతంగా ఫీలవుతారు. అలాగే ఎక్కువసేపు డాన్స్ కూడా చేయగలరు. ఈ కారణాలతో చాలామంది సెలబ్రిటీలు ఈ స్నేక్ వెనమ్ తీసుకుంటున్నారు. దీనికి అడిక్ట్ అయితే ప్రాణానికి కూడా ప్రమాదంగా చెప్తున్నారు. ఇదొక మాసిక రుగ్మతగా మారిపోతుంది. ఒక్కో సందర్భంలో ప్రాణాలు కూడా పోతాయి. ఇలాంటి కల్చర్ విదేశాల నుంచి మన దేశానికి పాకింది. విదేశాల్లో కూడా పాము విషానికి ఎంతో డిమాండ్ ఉంది. అక్కడ కూడా ఈ విషం, దానికి సంబంధించిన పౌడర్ ని అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు. మరి.. ఈ స్నేక్ వెనమ్ పై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.