iDreamPost
android-app
ios-app

వీడియో: ఉత్సవంలో ఏనుగుల కుమ్ములాట! ఇంత భీకరమా?

  • Published Mar 23, 2024 | 12:27 PM Updated Updated Mar 23, 2024 | 12:27 PM

సాధారణంగా ఆలయ ఉత్సవాల సమయంలో.. ఏనుగులను ఊరేగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేరళలో ఈ ఆచారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇటీవల కేరళలోని త్రిస్సూర్‌లోని తారక్కల్ ఆలయ ఉత్సవాలలో మాత్రం .. ఏనుగుల కారణంగా ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.

సాధారణంగా ఆలయ ఉత్సవాల సమయంలో.. ఏనుగులను ఊరేగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేరళలో ఈ ఆచారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇటీవల కేరళలోని త్రిస్సూర్‌లోని తారక్కల్ ఆలయ ఉత్సవాలలో మాత్రం .. ఏనుగుల కారణంగా ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.

  • Published Mar 23, 2024 | 12:27 PMUpdated Mar 23, 2024 | 12:27 PM
వీడియో: ఉత్సవంలో  ఏనుగుల కుమ్ములాట! ఇంత భీకరమా?

కేరళలోని ఆలయ ఉత్సవాలలో.. ముఖ్యంగా మనకు ఏనుగులు కనిపిస్తూ ఉంటాయి. ఏనుగులను సుందరంగా అలంకరించి ఊరేగించడం అనేది .. అక్కడి వారి ఆచారం. పండుగలు, ప్రత్యేకమైన రోజులు, ఆలయ వార్షికోత్సవాల సమయాలలో ఇలా ఏనుగులను ఊరేగిస్తూ ఉంటారు. ప్రతి పండుగకు ఆయా దేవుడు, దేవతలను బట్టి.. ఆయా ఉత్సవాలను జరుపుకుంటారు. ఎక్కువ శాతం ఏనుగులను మనం కేరళ ఉత్సవాలలోనే చూస్తూ ఉంటాము. అంతేకాకుండా కేరళలోని మెజారిటీ హిందూ దేవాలయాలు.. ఈ ఏనుగులను కలిగి ఉంటాయి. చాలా మంది భక్తులు వీటికి విరాళాలను కూడా అందిస్తూ ఉంటారు. అయితే, ఇటీవల రళలోని త్రిస్సూర్‌లోని తారక్కల్ ఆలయ ఉత్సవాలలో మాత్రం .. ఏనుగుల కారణంగా ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం కేరళలోని వివిధ ప్రాంతాలలోని ప్రసిద్ధ ఆలయాలలో ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిని పూరములు అని పిలుస్తూ ఉంటారు. వీటి అన్నిటిలో త్రిస్సూర్ లోని ఆలయంలో జరిగే ఉత్సవాలకు.. ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగలన్నీ కూడా హిందూ జ్యోతిషశాస్త్రంలోని పూరం అని పిలువబడే 27 నక్షత్రాలలో ఒకదానికి సంబంధించినవి. కాబట్టి వీటిని పూరములు అని అంటూ ఉంటారు. ముఖ్యంగా మార్చి , ఏప్రిల్ లలో పంటల కాలం తర్వాత .. ఈ ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటారు. అయితే, ఈ క్రమంలో అక్కడ “గజ్మేలా” పండుగలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పండుగలో చాలా పెద్ద పెద్ద ఏనుగులను అలంకరించి వారికి పోటీలు కూడా జరుపుతుంటారు. అయితే ఈ క్రమంలో తాజాగా.. నిర్వహించిన “గజ్మేలా” లో.. త్రిస్సూర్‌లోని తారక్కల్ ఆలయ ఉత్సవాలలో ఏనుగులు ఒక్కసారిగా విజృభించాయి.. ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. దీనితో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారిపోయింది.. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు.

ఇక ఆలయ ఉత్సవాల విషయానికొస్తే.. సాధారణ రోజులలో ఈ ఆలయ ఆచారాలు నిరాడంబరంగా ఉన్నప్పటికీ.. ప్రత్యేక రోజుల్లో మాత్రం ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. గుంపులు, గుంపులుగా ఏనుగుల ఊరేగింపులు, సంగీత విద్వాంసులు, బాణ సంచా కాల్చడం లాంటివి చేస్తూ ఉంటారు. అక్కడి వాతావరణం అంతా సందడిగా మారిపోతుంది. ఇక త్రిస్సూర్ జిల్లాలోని ఆలయాల్లో సంబరాలు ఇంకా బాగా జరుగుతాయి. ఇక్కడ దాదాపు 70 ఏనుగులు.. వేడుకలలో పాల్గొంటాయి. ఈ క్రమంలోనే అనుకోకుండ అక్కడ ఏనుగులు అలజడి సృష్టించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.