iDreamPost
android-app
ios-app

వీడియో: బ్రిటిష్ నేవీ సెయిలర్ నిర్వాకం.. తప్పతాగి చెన్నై రోడ్లపై హల్చల్!

UK Royal Navy Sailor: బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఒక సెయిలర్ హద్దు మీరి ప్రవర్తించాడు. వీధుల్లో పిచ్చి పట్టినట్లు హంగామా సృష్టించాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

UK Royal Navy Sailor: బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఒక సెయిలర్ హద్దు మీరి ప్రవర్తించాడు. వీధుల్లో పిచ్చి పట్టినట్లు హంగామా సృష్టించాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియో: బ్రిటిష్ నేవీ సెయిలర్ నిర్వాకం.. తప్పతాగి చెన్నై రోడ్లపై హల్చల్!

సాధారణంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఉండే వారికి క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. వాళ్లంతా ఎంతో డిసిప్లయిన్ గా ఉంటారు. దేశం ఏదైనా కూడా జవాన్ అంటే మాత్రం క్రమశిక్షణకు మారు పేరు అనే అంటారు. కానీ, ఎక్కడో ఒకరు మాత్రం ఆ పేరుకు కళంకం తీసుకొచ్చే పనులు చేస్తుంటారు. అలాగే యూకేకి చెందిన బ్రిటిష్ రాయల్ నేవీ సెయిలర్ ఒకతను అలాంటి పరువు తక్కువ పని చేశాడు. చెన్నై వీధుల్లో తప్పతాగి పెద్ద హంగామా సృష్టించాడు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

గతవారంలో యూకే నుంచి బ్రిటిష్ రాయల్ నేవీకి సంబంధించిన షిప్ చెన్నై చేరుకుంది. ఇండియన్ షిప్ యార్ట్ లోనే కావాల్సిన మరమ్మత్తులు కూడా చేయనున్నారు. ఇది యూకే- ఇండియా మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం జరుగుతున్న జాయింట్ ఆపరేషన్ లో భాగంగా జరుగుతోంది. అయితే ఈ బ్రిటిషన్ రాయల్ నేవీకి సంబంధించిన ఒక సెయిలర్ ఆదివారం రాత్రి చెన్నై వీధుల్లో నానా హంగామా సృష్టించాడు. ఆ నావికుడు కూడా తోటి వారితో కలిసి చెన్నైలోని మాల్ లో షాపింగ్ కు వెళ్లాడు. అయితే అందరూ లోపల షాపింగ్ చేస్తూ ఉంటే.. ఇతను మాత్రం కింద మాల్ లోకి వచ్చే వారితో వాగ్వాదానికి దిగాడు. ఇంకేముంది స్థానికులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అతను నానా హంగామా సృష్టించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా అతను కంట్రోల్ అవ్వలేదు. ఇష్టారీతిన పరుగులు పెట్టడం చేశాడు.

అందరూ కలిసి అతడిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ, లాక్కుని పరుగులు పెట్టాడు. ఆఖరికి ఒక కానిస్టేబుల్ అతడిని గట్టిగా పట్టుకుని ఆటోలో పడేసి అదుపు చేశాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. తోటి నావికులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులతో మాట్లాడారు. ఈ ఘటన తర్వాత ఆ హల్చల్ చేసిన బ్రిటిష్ రాయల్ నేవీ సెయిలర్ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకుండా తోటి నావికులకు అప్పజెప్పి పంపేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకి సంబంధించి నెటిజన్స్ నుంచి ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. మన తాతల ప్రతీకారాన్ని ఇప్పుడు తీర్చుకున్నట్లు అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మద్యం మత్తులో చెన్నై వీధుల్లో నానా హంగామా సృష్టించిన ఈ బ్రిటిష్ రాయల్ నేవీ సెయిలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by NDTV (@ndtv)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis