Tirupathi Rao
ప్రేమించి పెళ్లాడాలా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలా? ప్రస్తుతం సమాజంలో ఈ ప్రశ్న బాగా వినిపిస్తోంది. ఈ ప్రశ్నకు ఓ కుర్రాడు చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. అతను చెప్పిన సమాధానం ఏంటో మీరూ చూడండి.
ప్రేమించి పెళ్లాడాలా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలా? ప్రస్తుతం సమాజంలో ఈ ప్రశ్న బాగా వినిపిస్తోంది. ఈ ప్రశ్నకు ఓ కుర్రాడు చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. అతను చెప్పిన సమాధానం ఏంటో మీరూ చూడండి.
Tirupathi Rao
పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. జీవితం విలువ తెలియాలి అంటే.. పెళ్లి చేసుకుని బంధం, బాధ్యత, అనురాగాలను ఎక్స్ పీరియన్స్ చేయాలి అంటారు. అయితే ఇప్పుడున్న యువతలో పెళ్లి అంటే లేనిపోని అపోహలు మొదలయ్యాయి. విదేశాల్లో అయితే అసలు పెళ్లంటే ఆమడ దూరం పారిపోతున్నారు. ఈ జీవితాన్ని బ్రహ్మచారిగానే లాగించేస్తానంటూ వాగ్దానాలు కూడా చేస్తున్నారు. మన దగ్గర మాత్రం ఇంకో వింత ప్రశ్న కుర్రాళ్లను ఇబ్బంది పెడుతోంది. ప్రేమ పెళ్లి చేసుకోవాలా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ఈ ప్రశ్న ఓ యువకుడు అదిరిపోయే సమాధానం చెప్పాడు.
ప్రస్తుత రోజుల్లో ప్రేమ పెళ్లి అనేది సర్వ సాధారణం అయిపోయింది. పెద్దలు కూడా కులం, మతం, ఆస్తి, అంతస్థు అనే బేధాభిప్రాయాలు లేకుండా పిల్లల సంతోషం కోసం ఇష్టపడిన వారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ప్రేమ పెళ్లి చేసుకోవాలా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనే ప్రశ్నతో సతమతమవుతున్నవాళ్లు మాత్రం ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఎలాంటి పెళ్లి చేసుకుంట పరిస్థితులు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ప్రేమ వివాహం చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు వివరించాడు.
ఆ వైరల్ వీడియోలో యువకుడిని లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా అని ప్రశ్నించారు. అందుక.. “అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను. కట్నం ఇస్తారుగా. లవ్ మ్యారేజ్ కి ఛేజింగ్లు ఉంటాయి, మనం కష్టపడాలి. దెబ్బ మీద దెబ్బ. బియ్యం బస్తా 1500 అయ్యింది, ఆయిల్ క్యాన్ 1650, కందిపప్పు 163 అయ్యింది, చింతపండు 220 అంట ఎవరు కొంటారు కొనలేం బ్రో. మా వల్ల కాదు బ్రో. ఎందుకొచ్చిన రిస్క్. మనం తెచ్చిన పిల్లనుకో మా అమ్మ, ఆవిడ కొట్టుకున్నారనుకో నేను ఎవరికి సపోర్ట్ చేయాలి. నువ్వు తెచ్చిన పిల్లేగా సావంటారు. అదే వాళ్లు తెచ్చిన పిల్లనుకో.. మీరు అంటకట్టిందేగా మీరు మీరు సావండి అనచ్చు” అంటూ ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. ఈ ఆన్సర్స్ విన్న తర్వాత నెటిజన్స్ అంతా ఓ వర్గానికి నువ్వు ఇన్ స్పిరేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లిపై నీకు చాలా క్లారిటీ ఉందంటూ మెచ్చేసుకుంటున్నారు. బ్రదర్ ఉన్నది ఉన్నట్లు నిజాలు మాట్లాడుతున్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి.. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.