iDreamPost
android-app
ios-app

చంచల్ గూడ జైలుకి ప్రణీత్ హనుమంతు.. 15 రోజుల రిమాండ్!

  • Published Jul 11, 2024 | 5:53 PM Updated Updated Jul 11, 2024 | 5:53 PM

Praneeth Hanumanthu Sent to Chanchalguda Jail: ప్రణీత్ హనుమంతు కేసులో పోలీసులు పావులను వేగంగా కదుపుతున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత కోర్టు ప్రణీత్ హనుమంతుకు రిమాండు విధించారు.

Praneeth Hanumanthu Sent to Chanchalguda Jail: ప్రణీత్ హనుమంతు కేసులో పోలీసులు పావులను వేగంగా కదుపుతున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత కోర్టు ప్రణీత్ హనుమంతుకు రిమాండు విధించారు.

  • Published Jul 11, 2024 | 5:53 PMUpdated Jul 11, 2024 | 5:53 PM
చంచల్ గూడ జైలుకి ప్రణీత్ హనుమంతు.. 15 రోజుల రిమాండ్!

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఒక వీడియోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు.. తండ్రీ కూతుళ్ల బంధంపై దిగజారుడు కామెంట్స్ చేసినందుకు ఈ యూట్యూబర్ ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం బెంగళూరులో ప్రణీత్ హనుమంతును అరెస్టు చేసిన పోలీసులు అక్కడ ఫార్మాల్టీస్ పూర్తి చేసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత యూట్యూబర్ ని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు 15 రోజుల రిమాండ్ విధించింది.

పెద్ద ఎత్తున దుమారం రేపిన ప్రణీత్ హనుమంతు కేసులో.. అతనికి నాంపల్లి కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. తర్వాత ప్రణీత్ హనుమంతును చంచల్ గూడా జైలుకు తరలించారు. ఈ 15 రోజుల్లో కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, పూర్తి విచారణ పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. ప్రణీత్ హనుమంతు తాను విడుదల చేసిన వీడియోలోనే తన నేరాన్ని అంగీకరించాడు. కాబట్టి పోలీసులకు సహకరించే అవకాశం ఉంటుంది. అంటే ఈ కేసు త్వరగానే దర్యాప్తు పూర్తి కావచ్చు. అలాగే మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వారికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ప్రణీత్ హనుమంతు మాత్రం ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

తాను చేసింది తప్పేనని ఇప్పటికే యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అంగీకరించాడు. న్యాయపరంగా తాను ఏ పరిణామాలు ఎదురైనా కచ్చితంగా స్వీకరిస్తాను అంటూ ఇప్పటికే ప్రకటించాడు. ఈ కేసుకు సంబంధించి ప్రణీత్ హనుమంతు సోదరుడు ఇన్ ఫ్లుఎన్సర్ ఏయ్ జూడ్ కూడా స్పందించాడు. తమ్ముడు అయినా కూడా తప్పు చేస్తే తప్పే అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభమైంది. ప్రణీత్ హనుమంతు ఘటన నుంచి అరెస్టు వరకు సినిమా హీరోలు, సెలబ్రిటీలు, ఇన్ ఫ్లుఎన్సర్స్ కీలక పాత్ర పోషించారు. అంటే సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడానికి హీరోలు చేసిన పోరాటం కూడా ఒక కారణంగా చెప్పచ్చు. అలాగే ఇన్ ఫ్లుఎన్సర్స్ కూడా ప్రణీత్ హనుమంతుకు సంబంధించి వరుస పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet