iDreamPost
android-app
ios-app

సోషల్‌ మీడియాను ఊపేస్తున్న ‘చీన్‌ టపాక డమ్‌ డమ్‌’కి అర్థం ఏంటంటే?

  • Published Aug 10, 2024 | 6:21 PM Updated Updated Aug 21, 2024 | 4:06 PM

Chin Tapak Dum Dum, Meaning, Chota Bheem: చీన్‌ టపాక డమ్‌ డమ్‌.. ఈ పదం ఇప్పుడు సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. రీల్స్‌ ఓపెన్‌ చేస్తే చాలు.. ఇదే మాట వినిపిస్తోంది. మరి దీనికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Chin Tapak Dum Dum, Meaning, Chota Bheem: చీన్‌ టపాక డమ్‌ డమ్‌.. ఈ పదం ఇప్పుడు సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. రీల్స్‌ ఓపెన్‌ చేస్తే చాలు.. ఇదే మాట వినిపిస్తోంది. మరి దీనికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 10, 2024 | 6:21 PMUpdated Aug 21, 2024 | 4:06 PM
సోషల్‌ మీడియాను ఊపేస్తున్న ‘చీన్‌ టపాక డమ్‌ డమ్‌’కి అర్థం ఏంటంటే?

ఒకప్పుడు ఏదైనా మంచి సందేశాన్ని ప్రజల్లోకి పంపాలి అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కవులు, కళాకారులు, కథలు, కవితలు, పాటలు, పుస్తకాలు, పాత్రికేయులు అంటూ చాలా మంది చాలా రకాలుగా కష్టపడితే.. ప్రజలు అందరికీ ఆ విషయం రీచ్ అయ్యేది. కానీ.., ఇప్పుడు ఆ లెక్క మారిపోయింది. ఇప్పుడు అంతా సోషల్‌ మీడియా యుగం. ఓ చిన్న సినిమా డైలాగ్.. గంటల్లో కోట్ల మందికి చేరిపోతుంది. ఇక కాస్త ట్రెండింగ్ వీడియోస్, డైలాగ్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా ఇప్పుడు ఇలాంటి ఓ సంఘటనే జరిగింది. గత కొన్ని గంటలుగా ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేస్తే చాలు.. ‘చీన్‌ టపాక డమ్‌ డమ్‌’ అంటూ ఓ అర్థం కానీ మాట తెగ వినిపిస్తోంది. రీల్స్‌లో, వాట్సాప్‌ స్టేటస్‌లో, మీమ్స్‌ కంటెంట్‌లో ఎక్కడ చూసినా.. ‘చీన్‌ టపాక డమ్‌ డమ్‌’ రీ సౌండ్ వినిపిస్తూనే ఉంది. మరి.. ఇంతలా వైరల్ అవుతున్న ఈ డైలాగ్ కి అర్ధం ఏంటి?

చీన్‌ టపాక డమ్‌ డమ్‌ అంటే.. ప్రత్యేకించి ఎలాంటి అర్ధం లేదు. కానీ.. నెటిజన్స్ మాత్రం దీని అర్థం ఏంటి? ఈ పదం ఎక్కడిది? అంటే ఏ సినిమాలోది? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తూ.. గూగుల్ నే కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. పిల్లలు ఎక్కువగా చూసే పోగో ఛానల్‌లో ‘ఛోటా భీమ్‌’ అనే కార్టూన్‌ సిరీస్ ఉంది. దేశ వ్యాప్తంగా దీనికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆ సిరీస్ లోని ఓ విలన్‌ అతని పేరు ‘టకియా’. ఆ విలన్‌ పదే పదే చీన్‌ టపాక డమ్‌ డమ్‌ అంటూ ఉంటాడు. అయితే.. ఈ మాట 1996లో ‘లడ్కా లడ్కీ’ సినిమాలో బాలీవుడ్‌ పాతతరం సూపర్‌ స్టార్‌ కిశోర్‌ కుమార్‌ సైతం.. ‘చీ పటాక డమ్‌ డమ్‌(Chi Patak Dam Dam) అంటూ ఉంటాడు. ఆ వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఆ సినిమాలో కిశోర్‌ కుమార్‌ నోట పలికే మాటనే కాపీ కొట్టి.. ఛోటా భీమ్‌లోని విలన్‌ టకియాతో ‘చీన్‌ టపాక్‌ డమ్‌ డమ్‌(Chin Tapak Dum Dum) అని పలికించారని కూడా కొంతమంది నెటిజన్లు అంటున్నారు. కాపీ రైట్స్‌ ఇబ్బందులు వస్తాయని.. పటాక్‌ ను టపాక్‌గా మార్చారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇంతకీ.. ఈ చీన్  టపాక్‌ డమ్‌ డమ్‌ అంటే ప్రత్యేక అర్థం ఏమీ లేదు.  ఒక ఊతపదం లాంటింది. ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలంటే చంద్రముఖి సినిమాలో ‘లకలక’ అనే పదాన్ని రజినీ కాంత్‌ పలుకుతాడు కదా? అలా అనమాట. ఇలా టకియా’ విలన్‌ క్యారెక్టర్ పుణ్యమా అంటూ చీన్‌ టపాక డమ్‌ డమ్‌ దేశ వ్యాప్తంగా వైరల్ అయిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11)