iDreamPost
android-app
ios-app

వీడియో: వామ్మో.. చూస్తుండగానే కుప్పకూలిన ఐదు అంతస్తుల బిల్డింగ్!

  • Published Jan 20, 2024 | 10:21 PM Updated Updated Jan 20, 2024 | 10:21 PM

Building Collapses in Himachal Pradesh: ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనువిందు చేస్తున్నాయి. కొన్ని వైరల్ వీడియోలు చూస్తుంటే నవ్వు పుట్టించే విధంగా ఉంటే.. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ప్రకృతి లో జరిగే చిత్ర విచిత్రాలు మన కళ్ల ముందు ఆవిష్కరింపబడుతున్నాయి.

Building Collapses in Himachal Pradesh: ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనువిందు చేస్తున్నాయి. కొన్ని వైరల్ వీడియోలు చూస్తుంటే నవ్వు పుట్టించే విధంగా ఉంటే.. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ప్రకృతి లో జరిగే చిత్ర విచిత్రాలు మన కళ్ల ముందు ఆవిష్కరింపబడుతున్నాయి.

  • Published Jan 20, 2024 | 10:21 PMUpdated Jan 20, 2024 | 10:21 PM
వీడియో: వామ్మో.. చూస్తుండగానే కుప్పకూలిన ఐదు అంతస్తుల బిల్డింగ్!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు చూసే అవకాశం దొరుకుతుంది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో కనీ వినీ ఎరుగని రీతిలో వింతలు, విశేషాలు మన ముందు ఆవిష్కరింపబడుతుననాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించేలా ఉంటాయి. అలాంటి వీడియోలు చూస్తుంటే నిజంగా ఇలా కూడా జరుగుతాయా అన్న సందేహాలు కలుగుతుంటాయి. తాజాగా అందరూ చూస్తుండగానే ఓ ఐదంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి పోవడం షాక్ కి గురి చేసింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. అసలు ఏం జరిగిందో వివరాలు తెలుసుకుందాం..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లా సమీపంలో ఘండాల్ గ్రామంలో జాతీయ రహదారి 205 పక్కన ఉన్న ఐదు అంతస్తుల బిల్డింగ్ శనివారం అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. దీంతో జాతీయ రహదారి పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ ఘటనతో కొన్ని గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొండరాళ్లు ఈ బిల్డిండ్ కి తగలడంతో పాక్షికంగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో బిల్డింగ్ యజమాని అందులో ఉన్న లా కాలేజ్ విద్యార్థులను వారం రోజుల క్రితం ఖాళీ చేయించాడు. ఆ భవనానికి విద్యుత్ కలెక్షన్లు కూడా తొలగించారు. మరమ్మతులు చేయించి తిరిగి బిల్డింగ్ ని పునరుద్దీకరించాలని భావించాడు.

బిల్డింగ్ యజమాని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. బిల్డింగ్ పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలించిన ఇంజనీర్లు, అధికారులు మరమ్మత్తు చేసినా ఎప్పటికైనా కూలిపోయే ప్రమాదం ఉందని.. ఆ ప్రయత్నం విరమించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జనవరి 20, శనివారం మధ్యాహ్నం 12 గంట ప్రాంతంలో ఆ బిల్డింగ్ అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ముందస్తు చర్యల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కోట్ల రూపాయల ఖర్చుతో కట్టిన బిల్డింగ్.. తన కళ్ల ముందే కుప్పకూలిపోతుంటే యజమాని కన్నీరు పెట్టుకున్నారు. రెండు నెలల క్రితం హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎన్నో ఇళ్లు కూలిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిల్డింగ్ కూలిపోతున్న వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.