iDreamPost
android-app
ios-app

వీడియో: విద్యార్థుల ప్రశ్నా పత్రాలను వ్యాల్యుయేషన్ చేస్తూ టీచర్ల పాడుపని!

Teacher Making Reels While Exam Paper Correction: విద్యార్థులను దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. కొందరైతే ఆ వృత్తికే కళంకంగా మారుతున్నారు. కొత్తగా ఒక టీచరమ్మ చేసిన పని అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది.

Teacher Making Reels While Exam Paper Correction: విద్యార్థులను దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. కొందరైతే ఆ వృత్తికే కళంకంగా మారుతున్నారు. కొత్తగా ఒక టీచరమ్మ చేసిన పని అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది.

వీడియో: విద్యార్థుల ప్రశ్నా పత్రాలను వ్యాల్యుయేషన్ చేస్తూ టీచర్ల పాడుపని!

ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాలోనే ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఎవరో చేసిన రీల్స్ చూడటం మాత్రమే కాదు.. వాళ్లు కూడా రీల్స్ చేసి ఫేమస్ అయిపోవాలి అని చాలామందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ లిస్టులోకి సామాన్యులు, సెలబ్రిటీలు మాత్రమే కాదు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా వచ్చేశారు. ఇప్పటికే మీరు చాలా సందర్భాల్లో స్కూల్స్ లో టీచర్స్ రీల్స్ చేయడం, డ్యాన్సులు చేయడం చూసే ఉంటారు. ఇప్పుడు ఆ పైత్యాన్ని ఏకంగా విద్యార్థుల జీవితాల దాకా తీసుకొచ్చారు. ఒక ఉత్తమ టీచరమ్మ అయితే ఏకంగా పేపర్ వ్యాల్యుయేషన్ చేస్తుండగా రీల్స్ చేస్తూ నానా హంగామా చేసింది.

ఎవరి వ్యక్తిగత జీవితం వారికి ఉంటుంది. ఆ సమయంలో వారి వారి అభిరుచులు, అలవాట్లకు తగ్గట్లు వారికి నచ్చిన పనులు చేసుకోవచ్చు. కానీ, విధుల్లో ఉండగా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఉపేక్షించకూడదు. ప్రస్తుతం ఈ టీచర్ చేసిన నిర్వాకంపై నెట్టింట పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన బిహార్ లోని పాటలీపుత్ర విశ్వవిద్యాలయంలో జరిగింది. విద్యార్థులు రాసిన ప్రశ్నా పత్రాలను దిద్దుతున్నారు. అలాంటి సమయంలో వాళ్లు ఎంతో ఏకాగ్రతగా పని చేయాలి. ఎందుకంటే వాళ్లు వేసే మార్కులు ఒక విద్యార్థి జీవితాన్ని శాసిస్తాయి. అలాగే ఎంతో శ్రద్దగా చేయాల్సిన పని అది.

అలాంటి పనిని ఈ టీచర్స్ ఎంతో నిర్లక్ష్యంగా తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. పేపర్స్ కరెక్షన్ చేస్తుండగా వీడియోలు తీస్తూ హడావుడి చేశారు. ఒకరు వీడియో తీస్తూ ఉంటే.. ఒక టీచరమ్మ మాత్రం కెమెరాకు పోజులిస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంది. ఒక్క లైన్ కూడా చదవకుండా ఎంతో స్టైల్ గా టిక్కులు కొట్టుకుంటూ పోయింది. మార్కులు కూడా అలాగే వేసేసింది. విద్యార్థి ఎంతో కష్టపడి డ్రాయింగ్ వేస్తే.. కనీసం ఆ బొమ్మను చూడకపోవడం గమనార్హం. అక్కడ ఏం రాశారు? ఎలా రాశారు? ఏం కంటెంట్ ఉంది అనే దానితో సంబంధం లేకుండా కరెక్షన్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

విద్యార్థుల భవిష్యత్తును ఇలాంటి టీచర్లే నాశనం చేస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు పేపర్ వ్యాల్యూయేషన్ దగ్గర వీడియోలు, ఫొటోలు అంటూ ఏంటి వాళ్ల రచ్చ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మార్కుతో టాపర్స్ అయ్యే వాళ్లు ఉంటారు. అదే మార్కు రాలేదని ప్రాణాలు తీసుకునే వాళ్లు ఉంటారు. ఇలాంటి వాళ్లు చేసే నిర్లక్ష్యపు పనుల వల్ల అక్కడ విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి