సీసీటీవీ ఫుటేజ్: ప్రాణాలకు తెగించి నేరస్థుడిని అరెస్టు చేసిన కానిస్టేబుల్!

Bengaluru Cop: ఎలాంటి నేరస్తుడైనా సరే ఏదో ఒక పొరపాటు చేసి పోలీసులకు చిక్కిపోతుంటారు. చట్టం చేతి నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఎన్నోసార్లు రుజువైంది. ఓ నేరస్తుడిని పట్టుకోవడానికి పోలీస్ కానిస్టేబుల్ చేసి సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Bengaluru Cop: ఎలాంటి నేరస్తుడైనా సరే ఏదో ఒక పొరపాటు చేసి పోలీసులకు చిక్కిపోతుంటారు. చట్టం చేతి నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఎన్నోసార్లు రుజువైంది. ఓ నేరస్తుడిని పట్టుకోవడానికి పోలీస్ కానిస్టేబుల్ చేసి సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా కరడుగట్టిన నేరస్తులను పోలీసులు ఛేజింగ్ చేసి పట్టుకోవడం సినిమాల్లో ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలాంటిది నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుతుంటాయి. ఓ దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ నడిరోడ్డుపై ప్రాణాలకు తెగించి పట్టుకున్నాడు. కాస్త అటూ.. ఇటూ అయితే అతని ప్రాణాలు పోయి ఉండేవి అని అంటున్నారు స్థానికులు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలో ఓ నేరస్తుడిని పట్టుకోవడానికి కానిస్టేబుల్ చూపించిన ధైర్యసాహసాలు చూసి అందరూ శభాష్ అంటున్నారు.  నేరాలు చేసి తప్పించుకుతిరుగుతున్న ఓ నేరస్తుడిని పట్టుకోవడంలో కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి పట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మంజేష్ అనే నేరస్తుడు దాదాపు 80కి పైగా నేరాలకు పాల్పపడ్డాడు. కొంతకాలంగా పోలీసులకు చిక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. బెంగుళూరులో రద్దీగా ఉండే ప్రాంతంలో సివిల్ డ్రెస్ లో లింగయ్య అనే కానిస్టేబుల్ ఉన్నాడు. ట్రాఫిక్ లో సడెన్ గా మంజేష్ కనిపించాడు. అతని ముఖానికి కర్చీఫ్ కట్టు స్కూటీపై వెళ్లడం కానిస్టేబుల్ లింగయ్య గమనించాడు. అంతే ఒక్కసారిగా మంజేష్ స్కూటీని పట్టుకున్నాడు. అది గమనించిన మంజేష్ భయంతో ముందుకు పోనిచ్చాడు.. అయినా కూడా కానిస్టేబుల్ స్కూటీని వదలకుండా పట్టుకున్నాడు.

మంజేష్ తనను ఈడ్చుకు వెళ్తున్నా ఉడుంపట్ట పట్టాడు. దాదాపు 20 మీటర్ల వరకు అటూ ఇటూ వెళ్తూ ఈడ్చుకు వెళ్లాడు. అక్కడే ఇద్దరు ట్రాఫిక్ కానిస్టుబుల్స్ వచ్చి ఆపే ప్రయత్నం చేయగా స్కూటీ పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు మంజేష్. మరికొంత మంది బైకర్స్ సాయంతో నిందితుడ్ని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవి కెమెరాలో రికార్డు అయ్యాయి.   కానిస్టేబుల్ లింగయ్య చేసిన ధైర్య సాహసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాణాలకు తెగించి పట్టుకున్న కానిస్టేబుల్ లింగయ్య ను ఉన్నతాధికారులు అభినందించారు. కానిస్టేబుల్   సాహసానికి సెల్యూట్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Show comments