Swetha
ఇటీవల బర్రెలక్కకు సంబంధించిన ప్రతి వార్త ఎంత వైరల్ అవుతుందో అందరికి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఉగాది పండుగ నాడు బర్రెలక్క తల్లి ఆమె గురించి భావోద్వేగానికి గురైంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ఇటీవల బర్రెలక్కకు సంబంధించిన ప్రతి వార్త ఎంత వైరల్ అవుతుందో అందరికి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఉగాది పండుగ నాడు బర్రెలక్క తల్లి ఆమె గురించి భావోద్వేగానికి గురైంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
Swetha
బర్రెలక్క అలియాస్ కన్నె శిరీష .. ఇప్పుడు అందరికి తెలిసిన ఒక పాపులర్ అమ్మాయి. ఈమె సోషల్ మీడియాలో ఎలా పాపులర్ అయిందో అందరికి తెలుసు. ఇక ఇటీవల ఆమె నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వీడియో వరకు అన్నీ కూడా మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆమెతో పాటు ఆమె భర్త కూడా ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు. తాజాగా బర్రెలక్క దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన వివాహానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు అంటూ.. ఏర్పాట్లలో ఎక్కడైనా లోటు పాట్లు జరిగితే మన్నించండి అంటూ.. తనని తనతో పాటు తన భర్తను కూడా పాపులర్ చేసిన మీడియా, సోషల్ మీడియా వారికీ థాంక్స్ అంటూ.. ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. ఇక అది కాకుండ నిన్న జరిగిన ఉగాది పండుగ సంధర్బంగా బర్రెలక్క తల్లి ఎమోషనల్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇప్పటివరకు బర్రెలక్క గురించి.. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికి తెలుసు. ఆమె తన తల్లి, తమ్ముళ్ళతో కలిసి ఉంటుందని.. తండ్రి వారికి దూరంగా ఉంటాడని ఇలా ఆమె కుటుంబం గురించి తెలిసిందే. ఇక ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి తర్వాత పుట్టింటికి దూరంగా మెట్టినింట్లో జీవితాన్ని గడపాల్సిందే. అప్పటివరకు పుట్టినింట్లో జరుపుకున్న పండుగలు, చేసిన అల్లర్లకు దూరమవుతూ ఉంటారు ఆడపిల్లలు . పెళ్లి తర్వాత ఏ పండగైనా సరే ఇంకా అత్తారింట్లో చేసుకోవాల్సిందే. దీనితో ఒక్కసారిగా ఇంటినుండి వెళ్ళిపోయినా కూతుళ్లను తలుచుకుంటూ బాధపడని తల్లిదండ్రులు ఉండరు. ఇది ఎప్పటినుంచో ఎంతో మంది తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన. బర్రెలక్క కూడా అందరిలాంటే ఆడపిల్లే కదా మరి. ఈ క్రమంలో నిన్న జరిగిన ఉగాది సందర్బంగా బర్రెలక్క తల్లి ఆమెను తలుచుకుంటూ భావోద్వేగానికి గురైంది. పండుగ పూట బర్రెలక్క వారి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లి ఎమోషనల్ గా చెప్పిన మాటలు అందరిని భావోద్వేగానికి గురి చేశాయి.
“ప్రతి ఏటా నలుగురం కలిసి ఎంతో సంతోషంగా పండుగ చేసుకుంటాం. కానీ, ఈసారి ముగ్గురమే చేసుకుంటున్నాం అంటే మనసు చాలా బాధగా ఉంది .. ఆడపిల్ల అంటే ఇంకా ఇప్పుడు వారి ఇంటికే ఆడపిల్ల.. ఎవరికైనా తప్పదు కదా.. ఇప్పుడు చేసిన వంటలలో మా పాపా వంతు అలానే ఉంటుంది. లేదంటే గొడవ పెట్టుకుంది. బర్రెలక్కతో మాములుగా ఉండదు.. అవసరమైతే వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెకు తినిపించి వస్తాను.” అంటూ అల్లుడు కూడా నాకు మరొక బిడ్డతోనే సమానం అంటూ చెప్పుకొచ్చింది బర్రెలక్క తల్లి. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బర్రెలక్క విషయానికొస్తే పెళ్లి తర్వాత కూడా.. ఆమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఇక ఆమె రాజీకీయంగా కూడా ఏ మాత్రం వెనుక అడుగు వేయకుండా.. పార్లమెంట్ ఎన్నికలలో కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి సంబంధించిన ఒక పాటను కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.