iDreamPost
android-app
ios-app

వీడియో: బంగ్లా ప్రధాని ఇల్లు లూటీ.. తిన్నారు- తాగారు దొరికింది ఎత్తుకెళ్లారు!

Bangladesh Protesters Looted PM Hasina House: బంగ్లాదేశ్ లో ఏర్పడిన పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. పౌరులు అల్లర్లు చేయడమే కాకుండా.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం చేస్తున్నారు. అలాగే ప్రధాని నివాసాన్ని లూటీ చేశారు.

Bangladesh Protesters Looted PM Hasina House: బంగ్లాదేశ్ లో ఏర్పడిన పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. పౌరులు అల్లర్లు చేయడమే కాకుండా.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం చేస్తున్నారు. అలాగే ప్రధాని నివాసాన్ని లూటీ చేశారు.

వీడియో: బంగ్లా ప్రధాని ఇల్లు లూటీ.. తిన్నారు- తాగారు దొరికింది ఎత్తుకెళ్లారు!

ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్నీ బంగ్లాదేశ్ వైపే చూస్తున్నాయి. అక్కడ ప్రభుత్వం కూలిపోవడమే కాకుండా.. మిలటరీ పాలన అమలులోకి వచ్చింది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి.. ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. యువత మొత్తం రోడ్ల మీదకు వచ్చేసింది. కొన్నేళ్లుగా జరుగుతున్న పోరాటం మరోసారి తెరపైకి వచ్చింది. అంతేకాకుండా.. కొన్ని నెలలుగా ఈ పోరాటం తార స్థాయికి చేరింది. ఇప్పుడు పూర్తిగా చేతులు దాటేసింది. బంగ్లాదేశ్ పౌరులు అంతా రాజధాని నగరంలో లూటీకి దిగారు. ప్రధాన మంత్రి నివాసంలోకి చొచ్చుకొచ్చి దొరికింది దోచుకెళ్లారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. బంగ్లాదేశ్ కి సంబంధించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. అప్పట్లో ఆఫ్ఘనిస్థాన్ లో కనిపించిన దృశ్యాలే ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా దర్శనమిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైరల్ వీడియోలు నెటిజన్స్ ని ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తున్నాయి. బంగ్లాదేశ్ పౌరులు రోడ్ల మీదకు వచ్చి విధ్వంసం సృష్టించడమే కాకుండా.. లూటీలకు దిగారు. ప్రధాన మంత్రి నివాసాన్ని వదిలి వెళ్లిపోవడంతో ప్రధాని ఇంటినే లూటీ చేశారు. ప్రధాని నివాసంలోకి గుంపులుగా దూరి.. అక్కడున్న ఆహారాన్ని తినేశారు. ప్రధాని నివాసంలో ఉన్న వస్తువులను ఎవరికి దొరికింది వాళ్లు దోచుకెళ్లారు. చీరలు, టీవీలు, కోళ్లు, మేకలు, కొలనులో ఉన్న చేపలు, బాతులను కూడా వదల్లేదు. ఎవరికి దొరికింది వాళ్లు ఎత్తుకెళ్తున్నారు. సైన్యం కూడా వారిని అదుపు చేసే పరిస్థితి కనిపించలేదు.

మరోవైపు పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకెళ్లి గందరగోళం సృష్టించారు. అలాగే బంగ్లాదేశ్ పితామహుడిగా పిలుచుకునే షేక్ ముజుబిర్ రెహ్మాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. రిజర్వేషన్స్ విషయంలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. 1971లో స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత.. ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లను కల్పించారు. కొన్నాళ్లకు వ్యతిరేకతలు రావడంతో వాటిని పక్కన పెట్టారు. మళ్లీ హసీనా ప్రభుత్వం వాటిని తీసుకురావడంతోనే ఈ అల్లర్లు చెలరేగాయి. ఈ మొత్తం అల్లర్లలో దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారడమే కాకుండా.. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.