iDreamPost

హెలికాప్టర్‌ని పెట్టినట్టు ఇంటి మీద ఆటోని పెట్టిన వ్యక్తి! ఎందుకో తెలిస్తే షాకవ్వడం పక్కా..

  • Published May 26, 2024 | 11:50 AMUpdated May 26, 2024 | 11:50 AM

Auto On Top Of The Building: ఆటో ఇల్లు ఎక్కడం ఏంటి? హౌ క్రేజీ అని అనుకుంటున్నారా? పార్కింగ్ కి చోటు లేదేమో పాపం.. అందుకే ఇలా ఇంటి మీద పార్క్ చేసుకుని ఉంటాడు అని అనుకుంటున్నారా? లేదంటే తాగిన మత్తులో పైకి ఎక్కించాడు అని అనుకుంటున్నారా? అయితే ఇవేమీ కాదు. కానీ అతను అలా ఎందుకు చేశాడో తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం పక్కా. ఆ స్టోరీ తెలిస్తే గూస్ బంప్స్ వస్తాయి.

ఆటో ఇల్లు ఎక్కడం ఏంటి? అదేమైనా హెలికాప్టరా ఇంటి మీద పెట్టడానికి. కానీ ఒక వ్యక్తి తన ఆటోని మేడ మీద పెట్టాడు. హెలికాప్టర్ ని ఎత్తైన బిల్డింగుల పైన పెట్టినట్టు ఇతను ఆటోని ఇంటి మీద పెట్టాడు. పార్కింగ్ లేక ఇంటి మీద పెట్టాడని అనుకుంటే పొరపాటే. అతను ఆటోని ఇంటి మీద ఎందుకు పెట్టాడో తెలిస్తే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ముక్కున వేలేసుకుంటారు. అసలు విషయంలోకి వెళ్తే.. అతనొక ఆటోడ్రైవర్. ఆటో తోలుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆ ఆటో తోలుతూనే ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లంటే తెలుసుగా.. ఎంతోమందికి అదొక కల. జీవితంలో చచ్చేలోపు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని తాపత్రయపడుతుంటారు. దాని కోసం రాత్రి, పగలూ తేడా లేకుండా కష్టపడి డబ్బు పోగుజేసుకుంటూ ఉంటారు. ఈ ఆటో డ్రైవర్ కూడా అలానే కష్టపడి డబ్బు పోగుజేసుకుని సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు.

ఆటోకి గౌరవం:

అయితే తన కల నెరవేరడంలో ఆటో కృషి కూడా ఉందని ఆ వ్యక్తి దానికి గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆటో లేకపోతే తన సొంతింటి కల నెరవేరదని.. అందుకే దానికి అత్యున్నత స్థానం కల్పించాలని ఇలా ఇంటిపై పెట్టాడు. క్రేన్ సహాయంతో ఆటోని ఇంటి మేడ మీద పెట్టించాడు. మామూలుగా మనుషులు సహాయం చేస్తేనే పట్టించుకోని సమాజం ఇది. అలాంటిది ఒక వస్తువుని ఎంత దారుణంగా చూస్తారు. కొన్న కొత్తలో ఏ వస్తువుపై అయినా మోజు ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ దాని మీద మోజు తగ్గిపోతుంది. వాహనాలు అయినా అంతే. పెద్దగా పట్టించుకోము. అసలు మనిషి సక్సెస్ కి వాహనాలు కారణం అని ఎవరూ చెప్పరు. కనీసం ఇలా కూడా ఆలోచించరు. కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళు చాలా లోతుగా ఆలోచిస్తారు. ఆయుధ పూజ, వాహన పూజలు చేసేవారికి వాటి విలువ తెలుస్తుంది. మన భారతదేశ సంస్కృతిలో ఉన్న గొప్పతనం అదే. తమకు మేలు చేసేది పురుగైనా సరే దానికి గౌరవం ఇస్తారు.

ఊరంతా తెలిసేలా:

సంక్రాంతికి పశువుల పూజ, దసరాకి వాహన పూజ చేసి మనుషులతో పాటు సమానంగా చూసినట్టు ఈ వ్యక్తి కూడా తనకు మేలు చేసిన ఆటోని మనిషిలా ట్రీట్ చేశాడు. ఇల్లు కట్టుకోవడంలో ముఖ్య భూమిక పోషించిన ఆటోని అందలం ఎక్కించాడు. తన ఒక్కడి వల్లే ఇది సాధ్యం కాలేదు.. ఆటో కృషి కూడా ఉంది అని ఊరంతా తెలిసేలా ఇంటిపైన ఆటోని ఎక్కించాడు. అవకాశం లేదు కానీ ఆ ఆటోని నెత్తిన పెట్టుకుని ఊరంతా తిప్పేవాడేమో. ఏది ఏమైనా ఆటో డ్రైవర్ చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. శభాష్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కృతజ్ఞత చూపించడం అనేది నీ నుంచి నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరి ఈ ఆటోడ్రైవర్ చేసిన పనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

View this post on Instagram

A post shared by Aryan Tyagi (@aryantyagivlogs)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి